March 16, 202501:29:04 PM

Samantha: చై శోభిత నిశ్చితార్థం..సమంతని లాగుతున్న నెటిజన్లు.!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha)  .. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటుంది. ఆమెకు అనారోగ్య సమస్యలు తలెత్తడంతో.. పూర్తిగా ఆరోగ్యం మెరుగుపరుచుకునేందుకు సహజ సిద్దమైన చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే సోషల్ మీడియాలో మాత్రం అభిమానులతో టచ్ లోనే ఉంటుంది ఈ బ్యూటీ.తనకి సంబంధించిన ఫోటోలు, లేదు అంటే జీవిత సత్యాలకి సంబంధించిన కోట్స్.. ఇలా నిత్యం ఏదో ఒకటి షేర్ చేస్తూనే ఉంటుంది. గతంలో సమంత… అక్కినేని నాగ చైతన్యని (Naga Chaitanya)  ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

Samantha

2017 లో వీళ్ళు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. టాలీవుడ్లో ఉన్న బెస్ట్ కపుల్స్ లో ఒకరు అనిపించుకున్నారు. చైసామ్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువగానే ఉండేది. కానీ 2021 లో వీళ్ళు ఊహించని విధంగా విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించి షాకిచ్చారు. అక్టోబర్ 2న చైసామ్..లు విడాకులు ప్రకటించడం జరిగింది. అయితే ఇప్పుడు నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకుంటున్నట్టు ప్రకటించారు. హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో (Sobhita Dhulipala) నాగ చైతన్య ఎంగేజ్మెంట్ చేసుకున్నారు.

ఆ ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. నాగార్జున (Nagarjuna) ఈ ఫోటోలు షేర్ చేయగానే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ క్రమంలో సమంత ప్రస్తావన తెస్తున్నారు కొందరు నెటిజన్లు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో సమంత.. నాగ చైతన్యని ఉద్దేశించి ఏదో ఒక కోట్, లేదా పిక్ షేర్ చేస్తూ వచ్చేది. అయితే ‘చైతన్యలానే సమంత కూడా రెండో పెళ్లి చేసుకుని కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తుందా?’ అనే డిస్కషన్స్ కూడా ఇప్పుడు ఊపందుకున్నాయి.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.