March 29, 202505:20:22 PM

Saripodhaa Sanivaaram: ఆ విషయంలో జాగ్రత్త పడకపోతే.. కష్టమేనా..!

నాని (Nani)   , దర్శకుడు వివేక్ ఆత్రేయ (Vivek Athreya) కలయికలో రూపొందిన రెండో సినిమా ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) నిన్న అంటే ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షోతోనే సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో ఓపెనింగ్స్ కూడా బాగా వచ్చాయి. అక్కడి వరకు హ్యాపీ. కానీ సోలో రిలీజ్ దక్కినా.. ‘సరిపోదా శనివారం’ కి ‘దసరా’ (Dasara) రేంజ్లో రికార్డు ఓపెనింగ్స్ రాలేదు ఏంటి? అనే సందేహం నాని అభిమానులకి కలిగింది. సోషల్ మీడియాలో వీటిపై డిస్కషన్స్ కూడా జరుగుతున్నాయి.

Saripodhaa Sanivaaram

కొంతమంది గురువారం రిలీజ్ అయ్యింది కాబట్టి.. వర్కింగ్ డే వల్ల ఓపెనింగ్స్ ‘దసరా’ స్థాయిలో లేవు అని అభిప్రాయపడుతున్నారు. కానీ దానికి అందరూ ఏకీభవించడం లేదు. అందుకు కారణం వేరే ఉంది. ‘సరిపోదా శనివారం’ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ.. సెకండాఫ్ లో లెంగ్త్ ఎక్కువయ్యింది అనే కంప్లైంట్ ఉంది. అది కూడా సినిమాకి కలెక్షన్స్ కి మేజర్ ప్రాబ్లమ్ అయ్యే ఛాన్స్ లేకపోలేదు. దర్శకుడు వివేక్ ఆత్రేయ.. ‘మొదలు,మలుపు,పీటముడి,ఆటవిడుపు,మధ్యభాగం,దాగుడుమూతలు,ముగింపు’ అంటూ కొంచెం ఎక్కువ సన్నివేశాలే రాసుకున్నాడు.

డిటైలింగ్ ఎక్కువవ్వడం వల్లో ఏమో కానీ, సెకండాఫ్ కొంత ల్యాగ్ అనే ఫీలింగ్ అందరికీ కలిగింది. అంతెందుకు ‘సరిపోదా శనివారం’ రన్ టైం కూడా 2 గంటల 50 నిమిషాలు ఉంది. అంటే యాడ్స్ వంటి వాటితో కలుపుకుంటే 3 గంటలు అయిపోతుంది. అంత టైం థియేటర్లలో గడపాలి అంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఇబ్బందిగా ఫీలయ్యే అవకాశం లేకపోలేదు. అందువల్ల రన్ టైం విషయంలో ఏదో ఒక యాక్షన్ చిత్రం బృందం వెంటనే తీసుకుంటే మంచింది.

 ‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్‌ మొదలయ్యేది అప్పుడే.. నిర్మాత క్లారిటీ!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.