March 17, 202507:00:52 PM

SR Kalyanamandapam Collections: కిరణ్ అబ్బవరం ‘ఎస్.ఆర్.కళ్యాణమండపం’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా!

‘రాజావారు రాణిగారు’ (Raja Vaaru Rani Gaaru) చిత్రంతో హీరోగా మారిన కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) …‘టాక్సీవాలా’  (Taxiwaala) ఫేమ్ ప్రియాంక జవాల్కర్ (Priyanka Jawalkar) జంటగా నటించిన చిత్రం ‘ఎస్.ఆర్.కళ్యాణమండపం’ (SR Kalyanamandapam) . శ్రీధర్ గాదే (Sridhar Gade) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో సాయి కుమార్ (Pudipeddi Sai Kumar) కీలక పాత్ర పోషించారు. ‘ఎలైట్ ఎంట‌ర్ టైన్మెంట్స్’ బ్యానర్ పై రాజు , ప్ర‌మోద్‌లు (Pramod Chowdary) ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. కిరణ్ అబ్బవరంకి థియేట్రికల్ మార్కెట్ ఏర్పడేలా చేసిన సినిమా ఇది. చేతన్ భరద్వాజ్ (Chaitan Bharadwaj) సంగీతంలో రూపొందిన పాటలు కోవిడ్ లాక్ డౌన్ టైంలో మార్మోగాయి.

2021 ఆగస్టు 6న విడుదలైన ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించడానికి అదే కారణం అని చెప్పొచ్చు.నేటితో ఈ సినిమా రిలీజ్ అయ్యి 3 ఏళ్ళు పూర్తి కావస్తోంది. మరి ఫైనల్ గా బాక్సాఫీస్ వద్ద ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :

నైజాం 2.79 cr
సీడెడ్ 1.67 cr
ఉత్తరాంధ్ర 0.93 cr
ఈస్ట్ 0.53 cr
వెస్ట్ 0.35 cr
గుంటూరు 0.65 cr
కృష్ణా 0.33 cr
నెల్లూరు 0.19 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 7.44 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.19 Cr
  ఓవర్సీస్ 0.40 Cr
వరల్డ్ వైడ్ (టోటల్) 8.03 cr

‘ఎస్.ఆర్.కళ్యాణమండపం’ చిత్రం రూ.4.7 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. అయితే ఎవ్వరూ ఊహించని విధంగా ఈ సినిమా ఫుల్ రన్లో రూ.8.03 కోట్ల షేర్ ను రాబట్టి… బయ్యర్లు రూ. 3.48 కోట్ల లాభాలను అందించి సూపర్ హిట్ గా నిలిచింది.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.