March 25, 202510:03:54 AM

Sreeleela: శ్రీలీల సినిమాల్లో కెరీర్ ను కొనసాగించడానికి కారణమైన వ్యక్తి ఎవరో తెలుసా?

స్టార్ హీరోయిన్ శ్రీలీల (Sreeleela) కెరీర్ కు గుంటూరు కారం (Guntur Kaaram) తర్వాత కొంత గ్యాప్ వచ్చినా ఈ బ్యూటీ మళ్లీ వరుస సినిమాలతో బిజీ అవుతున్నారు. వచ్చిన ఆఫర్లను సద్వినియోగం చేసుకుంటూ శ్రీలీల సత్తా చాటుతున్నారు. చిన్న వయస్సులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) సినిమాతో పాటు రాబిన్ హుడ్ సినిమాలో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాయో చూడాలి.

తాజాగా శ్రీలీల సౌత్ ఇండియన్ సెన్సేషన్ అవార్డ్ ను సొంతం చేసుకోవడంతో పాటు తాతయ్య వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని తెలిపారు. తాను సినిమాలలో కెరీర్ ను కొనసాగించడానికి తాతయ్యే కారణమని శ్రీలీల కామెంట్స్ చేశారు. నటిగా కెరీర్ లో రాణించడానికి తాతయ్య కారణమని ఆమె అన్నారు. మాది విద్యావంతుల కుటుంబం అని మా ఫ్యామిలీలో డాక్టర్స్, ఇంజనీర్స్ ఎక్కువ అని శ్రీలీల పేర్కొన్నారు.

నేను సినిమాల్లోకి రావడానికి తాతయ్య ఎక్కువగా ప్రోత్సాహం అందించారని శ్రీలీల తెలిపారు. శ్రీలీల తాతయ్య మాట్లాడుతూ నా పేరు నాగేశ్వరరావు అని శ్రీలీల విషయంలో చాలా గర్వంగా ఉన్నానని అన్నారు. నా కూతురు ఒక డాక్టర్ అని నా కూతురిని చూసి మనవరాలు కూడా డాక్టర్ కావాలని అనుకుందని శ్రీలీల తాతయ్య పేర్కొన్నారు. ప్రస్తుతం శ్రీలీల ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతోందని ఆయన తెలిపారు.

శ్రీలీల టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం బిజీ కానున్నారని తెలుస్తోంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో శ్రీలీల ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. శ్రీలీల కథల ఎంపికలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుండగా శ్రీలీల రెమ్యునరేషన్ పరిమితంగా ఉందని సమాచారం అందుతోంది. రాబోయే రోజుల్లో శ్రీలీల రేంజ్ మరింత పెరుగుతుందేమో చూడాలి. జాన్వీ కపూర్ (Janhvi Kapoor) , భాగ్యశ్రీ భోర్సే (Bhagyasri Borse) మరి కొందరు హీరోయిన్ల నుంచి శ్రీలీలకు గట్టి పోటీ ఎదురవుతోంది.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.