March 21, 202501:40:43 AM

Vamshi Paidipally: ఆ స్టార్ హీరో కోసం వంశీ పైడిపల్లి పడిగాపులు..!

టాలీవుడ్లో ఇప్పుడు ఏ హీరో కూడా ఖాళీగా లేడు. చిన్న, మిడ్ రేంజ్ హీరోలు.. అందరిదీ ఇదే పరిస్థితి. దీంతో డైరెక్టర్లకి హీరోల కొరత ఏర్పడింది. పెద్ద పెద్ద డైరెక్టర్లు కూడా మిడ్ రేంజ్ హీరోల డేట్స్ కోసం పోటీ పడుతున్నారు. ఇంకొంతమంది దర్శకులు పక్క భాషల హీరోలతో సినిమాలు సెట్ చేసుకుంటున్నారు. గోపీచంద్ మలినేని (Gopichand Malineni) ఇప్పుడు సన్నీ డియోల్ (Sunny Deol) తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

Vamsi Paidipally

అలాగే వెంకీ అట్లూరి  (Venky Attluri) కూడా దుల్కర్  (Dulquer Salmaan)  తో ‘లక్కీ భాస్కర్’ (Lucky Baskhar) అనే సినిమా చేశాడు. ప్రశాంత్ వర్మ (Prasanth Varma) కూడా మొన్నామధ్య రణ్వీర్ సింగ్ (Ranveer Singh) తో సినిమా సెట్ చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆ ప్రాజెక్టు హోల్డ్ లో పడింది. ఏదేమైనా టాలీవుడ్ కి చెందిన చాలా మంది దర్శకులు పరభాషా హీరోల డేట్స్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు.

Vamshi Paidipally to wait for next 3 years1

ఈ లిస్ట్ లో మరో స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) కూడా ఉన్నట్టు మొన్నామధ్య వార్తలు వచ్చాయి. టాలీవుడ్ డైరెక్టర్స్ తో పోలిస్తే వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) కొంచెం డిఫరెంట్. అతను స్టార్ హీరోలైతేనే సినిమాలు చేస్తాడు. అది కూడా దిల్ రాజు (Dil Raju) బ్యానర్లోనే..! ఇటీవల అతను ఓ బాలీవుడ్ హీరోకి కథ చెప్పాడు. తెలుగు డైరెక్టర్లు ఓ కథ చెప్పడానికి వచ్చారు అంటే.. వెంటనే ‘ఓకే చేసేద్దామని’ బాలీవుడ్ హీరోలు భావిస్తున్నారు.

అందుకే ఓ స్టార్ హీరో.. వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) బుట్టలో పడిపోయాడని సమాచారం. ఫైనల్ వెర్షన్ కంప్లీట్ చేసి..ఆ స్టార్ హీరో డేట్స్ పట్టాలని వంశీ భావిస్తున్నాడట.ఇందుకోసం స్టార్ హోటల్లో కూర్చొని తన టీంతో స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నట్లు సమాచారం. మరి అతను ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి. ఇక వంశీ గత చిత్రం ‘వరిసు’ (Varisu)కూడా పరభాషా హీరోతోనే చేశాడు.

వేణు స్వామి దంపతుల ఆరోపణలపై స్పందించిన జర్నలిస్ట్ మూర్తి..!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.