March 20, 202511:23:51 AM

‘ఛత్రపతి’ టు ‘దేవర’.. కోస్టల్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన 10 సినిమాల లిస్ట్.!

ఇప్పుడంతా ‘దేవర’ (Devara) మేనియా నడుస్తుంది. ఎన్టీఆర్ (Jr NTR)  , దర్శకుడు కొరటాల శివ  (Koratala Siva)  కాంబినేషన్లో రూపొందిన సినిమా ఇది. 6 ఏళ్ళ తర్వాత ఎన్టీఆర్ సోలో హీరోగా తెరకెక్కుతున్న సినిమా కావడం, అలాగే ‘ఆర్.ఆర్.ఆర్’ (RRR) వంటి భారీ పాన్ ఇండియా సినిమా తర్వాత ఎన్టీఆర్ నుండి వస్తున్న సినిమా కావడంతో.. అంచనాలు భారీగా ఉన్నాయి. విడుదల చేసిన పాటలు, ట్రైలర్, రిలీజ్ ట్రైలర్ వంటివి ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకున్నాయి. ‘చుట్టమల్లె’ సాంగ్ అయితే చాలా ఫాస్ట్ గా ఆడియన్స్ లోకి వెళ్ళిపోయింది. ఇక ‘దేవర’ కథ కోస్టల్ బ్యాక్ డ్రాప్లో రూపొందింది.

Coastal Backdrop Movies

జాలర్ల జీవితాలు, వారు చేసే సాహసాలను ప్రధానంగా ఆధారం చేసుకుని తీసిన సినిమా ఇది అని స్పష్టమవుతుంది. అండర్ వాటర్ సీక్వెన్స్..లు వంటివి కూడా సినిమాలో హైలెట్ కానున్నాయట. అయితే ఇలాంటి జోనర్లో సినిమాలు రావడం అనేది ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా కోస్టల్ బ్యాక్ డ్రాప్లో (Coastal Backdrop) సినిమాలు వచ్చాయి. అవేంటో.. అందులో ఎన్ని సక్సెస్ అయ్యాయో.. ఇప్పుడు తెలుసుకుందాం రండి :

1) ఆరాధన :

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) , సుహాసిని (Suhasini) ,రాధిక (Radhika) , రాజశేఖర్ (Rajasekhar) కాంబినేషన్లో రూపొందిన ఈ సినిమా 1987 లో వచ్చింది. భారతీరాజా (Bharathiraja) దర్శకుడు. అల్లు అరవింద్ (Allu Aravind) ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో చిరంజీవి ఓ జాలరిగా కనిపిస్తారు. సినిమాలో పాటలన్నీ చాలా బాగుంటాయి. కానీ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ప్లాప్ గా మిగిలింది.

2) శుభ సంకల్పం :

కమల్ హాసన్ (Kamal Haasan) , ఆమని (Aamani) జంటగా నటించిన ఈ సినిమా 1995 లో వచ్చింది. కె.విశ్వనాథ్ (K. Vishwanath) దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇది. ఈ సినిమాలో కూడా హీరో కమల్ హాసన్ ఓ జాలరి. కీరవాణి (M. M. Keeravani) సంగీతంలో రూపొందిన పాటలు బాగుంటాయి. ఈ సినిమా మంచి ఫలితాన్నే అందుకుంది.

3) సముద్రం (Samudram :

జగపతిబాబు (Jagapathi Babu), సాక్షి శివానంద్ (Sakshi Shivanand) జంటగా నటించిన ఈ చిత్రం 1999లో వచ్చింది. కృష్ణవంశీ (Krishna Vamsi) దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా కూడా కోస్టల్ బ్యాక్ డ్రాప్లో (Coastal Backdrop) రూపొందింది. సినిమా బాగానే ఉన్నప్పటికీ యావరేజ్ ఫలితంతో సరిపెట్టుకుంది.

4) ఛత్రపతి (Chatrapathi) :

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) , రాజమౌళి (S. S. Rajamouli) కాంబినేషన్లో రూపొందిన మొదటి సినిమా ఇది. ఈ సినిమా కూడా కోస్టల్ బ్యాక్ డ్రాప్లో (Coastal Backdrop) రూపొందింది. 2005 లో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

5) గుండెల్లో గోదారి (Gundello Godari) :

ఆది పినిశెట్టి (Aadhi Pinisetty) ,సందీప్ కిషన్ ( Sundeep Kishan) , తాప్సీ (Taapsee Pannu), లక్ష్మీ మంచు (Manchu Lakshmi).. ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రానికి కుమార్ నాగేంద్ర దర్శకుడు. కోస్టల్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన ఈ సినిమా 2013 లో రిలీజ్ అయ్యింది. ఇళయరాజా సంగీతంలో రూపొందిన పాటలు బాగుంటాయి. కానీ సినిమా మాత్రం డిజాస్టర్ గా మిగిలింది.

6) ఉప్పెన (Uppena) :

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ (Panja Vaisshnav Tej), కృతి శెట్టి (Krithi Shetty) హీరో, హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన ఈ సినిమా 2021 లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇది కూడా కోస్టల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన మూవీనే..! కానీ చాలా ‘రా’ గా ఉంటుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది.

7) మహాసముద్రం (Maha Samudram) :

శర్వానంద్ (Sharwanand) , సిద్దార్థ్(Siddharth), అదితి రావ్ హైదరి (Aditi Rao Hydari), అను ఇమ్మాన్యుయేల్ (Anu Emmanuel)..లు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా కూడా కోస్టల్ బ్యాక్ డ్రాప్లోనే రూపొందింది. అజయ్ భూపతి (Ajay Bhupathi) దర్శకుడు. 2021 లో వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలింది.

8) వాల్తేరు వీరయ్య ( Waltair Veerayya) :

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) , దర్శకుడు బాబీ (K. S. Ravindra) .. కాంబినేషన్లో రూపొందిన ఈ సినిమా 2023 లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇది కూడా కోస్టల్ బ్యాక్ డ్రాప్..లో రూపొందిన మూవీనే. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది.

9) దేవర :

మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఎన్టీఆర్  (Jr NTR)  – కొరటాల శివ (Koratala Siva) ..ల ‘దేవర’ (Devara) కూడా కోస్టల్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన మూవీ. ఇందులో మాస్ ఎలిమెంట్స్ అన్నీ పుష్కలంగా ఉంటాయట. మరి ఇది ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

10) తండేల్ :

నాగ చైతన్య (Naga Chaitanya), దర్శకుడు చందూ మొండేటి (Chandoo Mondeti) కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమా కూడా కోస్టల్ బ్యాక్ డ్రాప్లో (Coastal) రూపొందుతుంది. నాగ చైతన్య ఇందులో ఫిషర్ మెన్ తండేల్ (Thandel) రాజ్ పాత్రలో కనిపించనున్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

11) RC16 :

రాంచరణ్ (Ram Charan) -దర్శకుడు బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా.. కోస్టల్ బ్యాక్ డ్రాప్లో (Coastal) రూపొందుతున్న ఓ స్పోర్ట్స్ డ్రామా అని తెలుస్తుంది. మరి ఇది ఎలా ఉంటుందో..!

22 ఏళ్ళ ‘చెన్నకేశవరెడ్డి’ గురించి 10 ఆసక్తికర విషయాలు.!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.