March 30, 202507:45:01 PM

Aditi Shankar: బెల్లంకొండ సరసన స్టార్‌ దర్శకుడి కుమార్తె.. ఇక్కడా రాణిస్తుందా?

ప్రముఖ దర్శకుడు శంకర్ (Shankar) కుమార్తె అదితి ఇప్పటికే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. అయితే సరైన విజయం ఇంకా ఆమెకు దక్కలేదు. దీంతో స్టార్‌ హీరోయిన్‌ ఛాన్స్‌కు దూరంగానే నిలిచింది. అయితే ఇప్పుడు టాలీవుడ్‌లో తన జర్నీ ప్రారంభించి తనేంటో నిరూపించుకోవాలని అనుకుంటోందా? అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. ఎందుకంటే ఆమె ఓ తెలుగు సినిమాకు ఓకే చెప్పిందట. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఓ కొత్త సినిమా కోసం ప్లాన్‌ చేస్తున్నారు. ఈ సినిమా కోసమే నిర్మాతలు అదితిని సంప్రదించినట్టు సమాచారం.

Aditi Shankar

అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఆమె టాలీవుడ్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చేది ఈ సినిమాతోనే అంటున్నారు. నిజానికి అదితి.. ఇప్పటికే ఓ తెలుగు సినిమాలో నటించింది అని సమాచారం. శంకర్‌ – రామ్‌చరణ్‌ (Ram Charan)  కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer) లో ఆమె ఓ ముఖ్య పాత్రలో కనిపించింది అంటున్నారు. ఒకవేళ అదే జరిగితే బెల్లంకొండ శ్రీనివాస్‌ (Bellamkonda Sai Sreenivas ) సినిమా ఆమెకు రెండోది అవుతుంది. అయితే హీరోయిన్‌గా మాత్రం తొలి సినిమానే అవుతుంది. ఇక అదితి కోలీవుడ్ సినిమాల సంగతి చూస్తే..

కార్తి (Karthi) ‘విరుమన్’ సినిమా ద్వారా ఆమె నటిగా ప్రవేశించింది. ఆ తర్వాత శివ కార్తికేయన్‌ (Sivakarthikeyan) ‘మావీరన్‌’ సినిమాలో నటించింది. ప్రస్తుతం ఆకాష్ మురళి హీరోగా ‘నేసిప్పాయా’ అనే సినిమాలో నటిస్తోంది. అర్జున్ దాస్‌తో (Arjun Das) ఓ సినిమా ఉంది అని టాక్‌. అదితి డాక్టర్ చదువుతూనే సినిమాలపై దృష్టిపెట్టింది. సినిమాల్లోకి రావాలనే ఆలోచన ఉన్నా ఎక్కడా తండ్రి పేరు ఉపయోగించుకోలేదు. వచ్చిన అవకాశాలను విజయాలుగా మలుచుకోలేకపోయింది.

మరిప్పుడు తెలుగులోకి వస్తే ఎలాంటి ఫలితం అందుకుంటుందో, కెరీర్‌ని ఎలా ముందుకు తీసుకెళ్తుందో చూడాలి. హీరోయిన్‌గా ఆమెకు ఇప్పుడు ఇది తొలి తెలుగు సినిమా కావొచ్చు కానీ.. సింగర్‌గా ఇప్పటికే ఆమె తెలుగులోకి వచ్చేసింది. వరుణ్‌తేజ్‌ (Varun Tej) సినిమా ‘గని’ (Ghani) లో ‘రోమియో జూలియెట్‌..’ అనే పాటను పాడింది. ఆ తర్వాత ‘మహావీరుడు’ అనే డబ్బింగ్‌ సినిమాలో ‘బంగారుపేటలోన..’ అనే పాటను కూడా పాడింది.

ఇక్కడ సినిమాలు చేయడానికి భయపడుతున్న టోవినో థామస్.. ఏమైందంటే?

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.