March 20, 202503:17:08 PM

Avika Gor: కొత్త లుక్‌తో కిర్రెక్కిస్తున్న అవికా గోర్‌.. ఫొటోలు చూశారా?

బాలనటిగా చేసి.. తర్వాత హీరోయిన్‌ అయ్యి విజయం అందుకున్న హీరోయిన్లు చాలా తక్కువమంది ఉంటారు. ఎందుకంటే బాలనటి లుక్‌ మనసులో ముద్రించుకుని ఉండటం వల్ల అభిమానులు ఆ నాయికను అలా ఊహించలేరు. ఇలాంటి ఇబ్బంది పడుతున్న కథానాయికల్లో అవికా గోర్‌  (Avika Gor)  ఒకరు. అయితే ఆమె లేటెస్ట్‌ ఫొటోలు తిరిగి హిట్‌ ట్రాక్‌ ఇచ్చేంతలా ఉన్నాయి. నారింజ పండులా నాజుగ్గా మారిన అవికా గోర్‌ ఫొటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.

Avika Gor

నారింజ రంగు ఔట్‌ఫిట్‌లో క్లీవేజ్‌ షోతో ‘టాప్‌’ లేపే అందాలను వడ్డించి కుర్రకారును కిర్రెక్కించింది అవికా గోర్‌ (Avika Gor). గత కొంతకాలంగా అవికా గోర్‌ అందాల ప్రదర్శన జరుగుతున్నా.. ఈసారి వచ్చిన ఫొటోలు మాత్రం కాస్త హీట్‌ పెంచేవే. కావాలంటే మీరే చూడండి. ‘బాలికా వధు’/ ‘చిన్నారి పెళ్ళికూతురు’ సీరియల్‌తో చిన్న వయసులోనే దేశవ్యాప్తంగా భారీగా అభిమానులను సంపాదించుకుంది అవికా గోర్ . ఆ గుర్తింపుతోనే టీనేజీలోనే హీరోయిన్ అయిపోయింది.

ఉమాదేవిగా ‘ఉయ్యాల జంపాలా’లో అలరించింది. అయితే ఆ తర్వాత చేసిన కథల ఎంపిక వల్ల సరైన కెరీర్‌ను బిల్డ్‌ చేసుకోలేకపోయింది. నిర్మాతగా మారినా విజయం దక్కలేదు. నిజానికి అవికా గోర్‌కి సినిమాలు లేకకాదు. అవకాశాలు రాక కాదు. అయితే ఆమెకు చిన్నతనంలోనే వచ్చిన ఫేమ్‌ కారణంగా సినిమా ఎంత విజయం సాధించినా అది ఆమె స్థాయికి తగ్గ విజయం కాదు అని అంటున్నారు. దానికితోడు అందాల ప్రదర్శనతో మాస్‌ హీరోయిన్‌ అవుదాం అంటే అదీ వీలు కావడం లేదు.

అందుకేనేమో ఇటు అందాల జాతరకు గేట్లు తెరిచేసింది. ప్రేమకథలు చేస్తూ, కుటుంబ కథలు చేస్తూ వచ్చిన అవికా గోర్‌కి (Avika Gor) సరైన విజయాలు రాకపోవడంతో రీసెంట్‌గా హారర్‌ సినిమాలవైపు వెళ్లింది. అక్కడైతే అనుకున్న విజయం దక్కింది. కానీ ఆమెలో ఇంకా మాస్‌ హీరోయిన్‌ ఆలోచనలు ఉన్నాయి అని లేటెస్ట్‌ ఫొటో షూట్లు చూస్తే అర్థమవుతోంది. చూద్దాం కొత్త లుక్‌లు ఆమె లక్‌ను ఏమన్నా మార్చుతుందేమో.

 

View this post on Instagram

 

A post shared by Avika Gor (@avikagor)

ఈ సినిమా తేడా కొడితే.. కృతి ఇక అయిపోయినట్లేనా?

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.