March 18, 202503:01:37 AM

Dasara Release: దసరా సినిమాలలో ఆ భారీ బడ్జెట్ సినిమాలు బాక్సాఫీస్ ను షేక్ చేస్తాయా?

ప్రతి సంవత్సరం ముఖ్యమైన పండగ సీజన్లలో దసరా పండుగ (Dasara Release) ఒకటి కాగా మొదట దసరా కానుకగా షెడ్యూల్ అయిన దేవర (Devara) ఓజీ (OG Movie) రిలీజ్ డేట్ మారడంతో ఈ నెల 27వ తేదీనే విడుదలవుతోంది. దేవర ప్రీపోన్ కావడంతో దసరా కానుకగా పలు తెలుగు సినిమాలతో పాటు రజనీకాంత్ (Rajinikanth) నటించిన వేట్టయాన్ (Vettaiyan) మూవీ కూడా విడుదలవుతోంది. వేట్టయాన్ టైటిల్ తోనే ఈ సినిమా అన్ని భాషల్లో విడుదలవుతూ ఉండటం గమనార్హం. దసరా సెలవులు అక్టోబర్ తొలి వారం నుంచి మొదలుకానుండగా అక్టోబర్ నెల 4వ తేదీన శ్రీవిష్ణు (Sree Vishnu) స్వాగ్ మూవీ విడుదలవుతోంది.

Dasara Releases

రాజ రాజ చోర (Raja Raja Chora) తర్వాత హసిత్ గోలి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాలో శ్రీవిష్ణు నాలుగు భిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారు. రజనీకాంత్ వేట్టయాన్ మూవీ అక్టోబర్ నెల 10వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. టి.జె.జ్ఞానవేల్ (T. J. Gnanavel) డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కగా వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. ఈ సినిమాలో రజనీకాంత్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు.

అక్టోబర్ నెల 11వ తేదీన గోపీచంద్ శ్రీనువైట్ల (Srinu Vaitla) కాంబో మూవీ విశ్వం (Vishwam) థియేటర్లలో విడుదలవుతోంది. అటు గోపీచంద్ (Gopichand) ఇటు శ్రీనువైట్ల ఈ సినిమాతో కచ్చితంగా సక్సెస్ సాధించాల్సి ఉన్న నేపథ్యంలో ఈ సినిమా బాక్సాఫీస్ రిజల్ట్ ఏ విధంగా ఉండనుందో చూడాల్సి ఉంది. అక్టోబర్ నెల 12వ తేదీన సుధీర్ బాబు (Sudheer Babu) హీరోగా తెరకెక్కిన మా నాన్న సూపర్ హీరో (Maa Nanna Superhero) సినిమా థియేటర్లలో విడుదల కానుంది. తండ్రీ కొడుకుల మధ్య అనుబంధంకు సంబంధించిన కథతో ఈ సినిమా తెరకెక్కింది.

అక్టోబర్ 12వ తేదీన సుహాస్ (Suhas) నటించిన జనక అయితే గనక (Janaka Aithe Ganaka) మూవీ కూడా రిలీజ్ కానుంది. శ్రీవిష్ణు, రజనీకాంత్, గోపీచంద్, సుధీర్ బాబు, సుహాస్ లకు కెరీర్ పరంగా భారీ బ్లాక్ బస్టర్ హిట్లు అవసరం కాగా స్వాగ్, వేట్టయాన్, విశ్వం సినిమాలు ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కాయి. ఈ భారీ బడ్జెట్ సినిమాలు, చిన్న సినిమాలు అయినా భారీ అంచనాలతో విడుదలవుతున్న (Dasara Release) మా నాన్న సూపర్ హీరో, జనక అయితే గనక బాక్సాఫీస్ ను షేక్ చేస్తాయేమో చూడాలి.

జానీ మాస్టర్ సైలెన్స్ గురించి ప్రశిస్తున్న ఫ్యాన్స్.. సైలెన్స్ బ్రేక్ చేయాలంటూ?

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.