March 23, 202505:52:55 AM

Devara: ‘దావుది’ సాంగ్ పోస్టర్స్ పై ట్రోలింగ్.. ఏమైందంటే..?

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ (Koratala Siva) , ఎన్టీఆర్ (Jr NTR)  కాంబినేషన్లో ‘దేవర’ (Devara)  అనే పాన్ ఇండియా సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ‘యువ సుధా ఆర్ట్స్’ బ్యానర్ పై మిక్కిలినేని సుధాకర్ (Sudhakar Mikkilineni) నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. సెప్టెంబర్ 27 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్, ట్రైలర్..లకి మంచి రెస్పాన్స్ లభించింది. అనిరుధ్  (Anirudh Ravichander) ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ఆల్రెడీ రెండు పాటలు బయటకు వచ్చాయి.

Devara

రెండిటికీ మంచి రెస్పాన్స్ లభించింది. ముఖ్యంగా ‘చుట్టమల్లె’ సాంగ్ చార్ట్ బస్టర్ అయ్యింది. మొదట ఈ సాంగ్ పై ట్రోల్స్ వచ్చినా, ఎక్కువగా వైరల్ అవ్వడంతో యూట్యూబ్ లో మిలియన్ల కొద్దీ వ్యూస్ నమోదయ్యాయి. అంతా బాగానే ఉంది. కానీ ‘దేవర’ (Devara) లో హీరోయిన్ విషయంలో కూడా ఇప్పుడు ఎక్కువగా ట్రోల్స్ వస్తున్నాయి. శ్రీదేవి (Sridevi) కూతురు జాన్వీ కపూర్  (Janhvi Kapoor)  .. ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమవుతుంది. ‘చుట్టమల్లె’ సాంగ్లో ఈమె గ్లామర్ కూడా బాగా హైలెట్ అయ్యింది.

అయితే ఈమెకి, ఎన్టీఆర్ కి మధ్య హైట్ డిఫరెన్స్ ని.. వేలెత్తి చూపిస్తూ కొంతమంది ట్రోలింగ్ కి దిగారు. వాస్తవానికి జాన్వీ కపూర్ కంటే ఎన్టీఆర్ కొంచెం హైట్ తక్కువ. దాన్ని కవర్ చేయడానికి మేకర్స్ బాగా కష్టపడుతున్నట్టు సాంగ్లోని విజువల్స్ ని బట్టి అర్థం చేసుకోవచ్చు అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు మూడో పాట కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘దావుది’ అంటూ సాగే పాటకు సంబంధించిన స్టిల్స్ పై కూడా కొంతమంది నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

ముఖ్యంగా ఈ పాటకు సంబంధించిన ఇప్పటివరకు వదిలిన స్టిల్స్ అన్నిటిలో ‘బెండింగ్ ఫోజులు మాత్రమే ఉన్నాయి’ అంటూ ట్రోల్స్ చేస్తున్నారు కొంతమంది నెటిజన్లు. అయితే ఈ సాంగ్లో ఎన్టీఆర్ డ్యాన్స్ మూమెంట్స్ మాత్రం అదిరిపోతాయి అని టాక్. మరి అవి చూసి అయినా ఈ సాంగ్ పై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్న వారు తగ్గుతారేమో చూడాలి.

కాందహార్‌ షాక్‌.. మొత్తం సెట్‌ రైట్‌ అవుతున్న నెట్‌ఫ్లిక్స్‌.. ఏమైందంటే?

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.