March 25, 202509:56:15 AM

Directors: ఒక్క ఫ్లాప్‌ అంత చేటు చేస్తుందా? సినిమాలు వచ్చిన్లే వచ్చి.!

ఏదైనా రంగంలో బెంచ్‌ స్ట్రెంగ్త్‌ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. ఒకరు పోరాటం (వర్క్‌)లోకి దిగి ఇబ్బంది పడితే.. బెంచ్‌ మీద ఉన్న ప్లేయర్లు బరిలోకి దిగి తమ సత్త చాటుతారు. అయితే ఇది పెద్దగా ఉపయోగపడని, ఆ మాటకొస్తే పెద్ద తప్పు అయిన రంగం సినిమా రంగం. ఇందులో రెస్ట్‌కి, గ్యాప్‌కి ఆస్కారం లేదు. అందులోనూ భారీ విజయాలు అందుకున్న దర్శకులు (Directors) ఎక్కువ గ్యాప్‌ తీసుకోవడమూ సరికాదు.

Directors

కావాలంటే మీరే చూడండి టాలీవుడ్‌లో ఇప్పుడు బెంచ్‌ స్ట్రెంగ్త్‌ భారీగా పెరిగిపోయింది. ఇంకా చెప్పాలంటే నెల తిరిగేసరికి ఒకు వచ్చి యాడ్‌ అవుతున్నారు. వివిధ కారణాల వల్ల ఆ దర్శకులు సినిమా స్టార్ట్‌ చేయడం లేదు. ఒకప్పుడు బ్లాక్ బస్టర్‌ దర్శకుడు అని పేరు ఉన్న వి.వి.వినాయక్‌ (V. V. Vinayak) ఇప్పుడు దాదాపు రిటైర్ అయిపోయినట్లే అంటున్నారు. పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh) అయితే విజయం కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్నారు కానీ.. ఎలాంటి ఉపయోగం ఉండటం లేదు.

ఇక శ్రీకాంత్ అడ్డాల (Srikanth Addala) పరిస్థితి సరేసరి. ‘పెదకాపు’ (Peddha Kapu 1) అంటూ ఓ భారీ సినిమా భుజనానికెత్తుకుని బొక్క బోర్లాపడ్డారు. హరీష్ శంకర్ (Harish Shankar) సంగతి తెలిసిందే. ‘మిస్టర్‌ బచ్చన్‌’ (Mr. Bachchan) అంటూ రవితేజతో (Ravi Teja) వచ్చి ‘త్వరలో’ అని తేల్చి చెప్పి వెళ్లిపోయారు. వీళ్లంతా ఒక లెక్క అయితే వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) మరో లెక్క. మరోవైపు క్రిష్ (Krish Jagarlamudi) లాంటి దర్శకుడు (Directors) ‘హరి హర వీర మల్లు’ (Hari Hara Veera Mallu) సినిమా నుండి బయటికొచ్చారు. కొత్త సినిమా ఏదో చేస్తారు అంటున్నారు కానీ క్లారిటీ లేదు.

వీళ్ల సినిమాలు చూస్తే.. ఏదో ఐదారు సినిమా ఫ్లాప్‌ అయ్యాక గ్యాప్‌ తీసుకోలేదు. చాలా సినిమా తర్వాత వస్తున్నారు. దీంతోనే సమస్య ఉందని నా అభిప్రాయం. పెద్ద ఎత్తున చర్చలు, ఉపచర్చలు జరుపుతున్నారు. అయితే ఇంతమంది సీనియర్లు, ప్రతిభావంతులు ఒక్క సినిమా ఫ్లాప్‌ / డిజాస్టర్‌తో అలా అయిపోయారేమో అనే వాదన వినిపిస్తోంది.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.