March 22, 202509:40:00 AM

Game Changer Vs Baby John: గేమ్ ఛేంజర్ కు పోటీగా ఆ సినిమా.. శంకర్ కు భారీ షాక్ అంటూ?

సాధారణంగా పెద్ద సినిమాలకు సోలో రిలీజ్ డేట్ దక్కితే మాత్రమే కలెక్షన్ల పరంగా ప్లస్ అవుతుంది. ఒకేరోజు రెండు పాన్ ఇండియా సినిమాలు విడుదలైతే మాత్రం ఏదో ఒక సినిమా కలెక్షన్ల పరంగా తీవ్రస్థాయిలో నష్టపోక తప్పదు. గేమ్ ఛేంజర్ సినిమా ఇప్పటికే ఎన్నో రిలీజ్ డేట్లను మార్చుకుని ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా రిలీజ్ కానుంది. డేట్ అధికారికంగా ప్రకటించకపోయినా గేమ్ ఛేంజర్ ను (Game Changer)    ఈ ఏడాదే కచ్చితంగా రిలీజ్ చేయాలని దిల్ రాజు (Dil Raju) ఫిక్స్ అయ్యారనే సంగతి తెలిసిందే.

Game Changer Vs Baby John

అయితే అట్లీ (Atlee) డైరెక్షన్ లో తెరకెక్కుతున్న బేబీ జాన్ మూవీ కూడా క్రిస్మస్ కానుకగా విడుదల కానుందని తెలుస్తోంది. శంకర్ (Shankar)  సినిమాకు పోటీగా అట్లీ సినిమా విడుదలైతే రెండు సినిమాలకు కలెక్షన్ల పరంగా నష్టం తప్పదు. శంకర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా గతంలో పని చేసిన అట్లీ ఇప్పుడు శంకర్ సినిమాకే పోటీగా తన సినిమాను విడుదల చేస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది.

శంకర్, అట్లీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడితే క్రిస్మస్ పోటీలో విజేతగా ఎవరు నిలుస్తారో చూడాల్సి ఉంది. క్రిస్మస్ కు భారీ సినిమాలేవీ లేవని గేమ్ ఛేంజర్ (Game Changer) కు పెద్దగా పోటీ లేదని భావిస్తున్న తరుణంలో అట్లీ నిర్ణయం గేమ్ ఛేంజర్ అభిమానులను ఒకింత టెన్షన్ పెడుతోంది. జవాన్ సినిమాతో మాస్ డైరెక్టర్ గా ఈ దర్శకుడు తన స్థాయిని పెంచుకున్నారు.

వరుణ్ ధావన్ (Varun Dhavan) , కీర్తి సురేష్ (Keerthy Suresh) జంటగా తెరి మూవీ రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. జవాన్ (Jawan) సినిమా సక్సెస్ తో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ సినిమాపై భారీగానే అంచనాలు ఏర్పడ్డాయి. సినిమా అంచనాలను అందుకుంటే మాత్రం సరికొత్త రికార్డులు క్రియేట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. వరుణ్ ధావన్, కీర్తి సురేష్ బేబీ జాన్ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది.

సినీ పరిశ్రమలో ఘోర విషాదం.. నటి తండ్రి కన్నుమూత.!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.