March 24, 202508:42:42 AM

Jayam Ravi: మరోసారి ఓపెన్‌ అయిన జయం రవి.. భార్య ఆరోపణలపై ఫుల్‌ క్లారిటీ!

మామూలుగా అయితే సినిమా పరిశ్రమలో సెలబ్రిటీ కపుల్‌ విడాకులు సామరస్యంగా అయ్యేలా చూసుకుంటారు. తర్వాత ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ ప్రముఖ తమిళ కథానాయకుడు జయం రవి (Jayam Ravi) విడాకుల విషయంలో మాత్రం అలా జరగలేదు. మామూలుగా అందరు సెలబ్రిటీల తరహాలోనే జయం రవి తన విడాకుల ప్రకటనను సోషల్‌ మీడియాలో చేశాడు. కానీ ఆయన భార్య ఆర్తి మాత్రం తనకు తెలియకుండానే విడాకుల ప్రకటన చేశారు అంటూ ఆరోపించారు.

Jayam Ravi

తాజాగా, ఈ విషయంలో జయం రవి స్పందించారు. తన తదుపరి చిత్రం ‘బ్రదర్‌’ ప్రచారంలో భాగంగా ఏర్పాటు ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ విడాకుల వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘మా విడాకుల గురించి రకరకాల డిస్కషన్లు జరుగుతున్నాయి. కొంతమంది నా సమస్యను అర్థం చేసుకొని నా వ్యక్తిగత జీవితానికి గౌరవం ఇస్తున్నారు. కానీ మర్యాద లేని కొంతమంది వ్యక్తులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. అయినా నా దగ్గర ఆధారాలు ఉన్నాయి అని జయం రవి చెప్ఆపరు.

నేను ఈ విషయాన్ని కోర్టులో నిరూపించుకుంటాను. నిజం బయటపడిన రోజు నాపై తప్పుడు ఆరోపణలు చేసిన వ్యక్తులపై తగిన చర్యలు తీసుకునే పరిస్థితి వస్తుంది. నా పేరు, ప్రతిష్టలను నాశనం చేయాలని ఆ కొంతమంది ప్రయత్నిస్తున్నారు అని జయం రవి కామెంట్స్‌ చేశారు. అలాగే లాయర్‌ ద్వారా ఆర్తికి విడాకుల నోటీసు పంపించానని, ఆ విషయం ఆమె తండ్రికీ తెలుసని రవి చెప్పారు. అంతేకాదు ఈ విషయం గురించి మా ఇంట్లో ఇరు కుటుంబాల పెద్దలు చర్చించుకున్నారు అని కూడా చెప్పారు.

పెద్దబ్బాయి అరవ్ పుట్టిన రోజు జూన్‌లో జరిగినప్పుడు వాడితో కలిసి సెలబ్రేట్‌ చేసుకోవడం కోసం చెన్నైలోనే ఉన్నానని జయం రవి చెప్పారు. దానికి సంబంధించిన ఫొటోలు తన దగ్గర ఉన్నాయని చెప్పారు. అలాగే విడాకుల విషయంలో అరవ్‌తో మాట్లాడానని చెప్పారు. అయితే ఆర్తి, నేను కలసి ఉండాలనేదే మా పెద్దబ్బాయి ఆలోచన అని రవి చెప్పారు. అయాన్‌ చిన్నవాడని, ఈ విషయాలను అర్థం చేసుకునే వయసు వాడిది కాదు అని జయం రవి తెలిపారు.

హిట్టు సినిమాకి కూడా కనీసం 30 రోజులు ఆగలేదుగా.!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.