March 21, 202501:20:36 AM

Koratala Siva: డైరెక్టర్ కొరటాల శివ చురకలు.. చిరుకేనా?

దర్శకుడు కొరటాల శివ (Koratala Siva)  , మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)  కాంబినేషన్లో ‘ఆచార్య’ (Acharya) అనే సినిమా వచ్చింది. 2020లో మొదలైన ఈ సినిమా షూటింగ్ కోవిడ్ వల్ల అనేకమార్లు వాయిదా పడుతూ ఎట్టకేలకు… 2022 కి కంప్లీట్ అయ్యింది. ఆ తర్వాత అదే ఏడాది ఏప్రిల్ 29న రిలీజ్ అయ్యింది. మొదటి షోతోనే ఈ సినిమాకి డిజాస్టర్ టాక్ వచ్చింది. కొరటాల వరుస బ్లాక్ బస్టర్లకి ఈ సినిమా బ్రేకులు వేసినట్టు అయ్యింది.ఈ సినిమాతో కొరటాల పనితనంపై కూడా చాలా మంది అనుమానపడ్డారు.

Koratala Siva

మరోపక్క ‘కొరటాలని చిరు డైరెక్షన్ చేయనివ్వలేదేమో…అందుకే ఔట్పుట్ ఇలా వచ్చింది’ అంటూ అతన్ని వెనకేసుకొచ్చారు. అయితే ఇటీవల ‘దేవర’ (Devara) ట్రైలర్ చూసి ఎన్టీఆర్ అభిమానులు కూడా కంగారు పడుతున్న సందర్భాలు చూస్తూనే ఉన్నాం. సోషల్ మీడియాలో ‘దేవర’ పై ట్రోలింగ్ కూడా ఓ రేంజ్లో జరిగింది. ఇవన్నీ ఎలా ఉన్నా.. ‘ఆచార్య’ వల్ల కొరటాల- చిరు..ల మధ్య కొంత గ్యాప్ వచ్చినట్టే కనిపిస్తుంది.

‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) ప్రమోషన్స్ టైంలో ‘డైరెక్టర్ అంటే బాబీలా  (K. S. Ravindra) ఉండాలి, ఇతను ఎక్కువ ఫుటేజీ తీసి నిర్మాతలపై బడ్జెట్ భారం పెంచలేదు, ఏమైనా ఇన్పుట్స్ ఇస్తే తీసుకున్నాడు’ అంటూ పరోక్షంగా ‘ఆచార్య’ దర్శకుడు కొరటాలకి చురకలు అంటించారు చిరు. ఇప్పుడు కొరటాల వంతు వచ్చినట్టు ఉంది. ‘దేవర’ ప్రమోషన్స్ లో కొరటాల మాట్లాడుతూ.. ‘నాకు ఇచ్చిన జాబ్..కి, ఐ యాం అకౌంటబుల్. ఆ ఒక్క భయం ఉంటే చాలు..

ఇంకెవ్వడి భయం అవసరం లేదు. ఆ ఒక్క భయమే అడుగుతుంది. నీకో పని ఇచ్చారు.. అది చేసేశావ్. భయంతో..! అమ్మో… ఇది అవ్వకపోతే ఏంటి అనే భయం ఉంది. ప్రపంచమంతా ప్రశాంతంగా ఉంటుంది ఎవడి పని వాడు చేస్తే..! పక్కనోడి పనుల్లో చెయ్యి దూర్చి ఆడిని ఇబ్బంది పెట్టి.. ఇది పెట్టి, మనది మనం చేయక… ఇంతకు మించింది ఏముంది’ అంటూ కొరటాల పరోక్షంగా చిరుకి చురకలు అంటించారు. ప్రస్తుతం కొరటాల కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఏఎన్నార్ శతజయంతి ఉత్సవాలకు దూరంగా అఖిల్.. నాగ్ ఏమన్నారంటే?

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.