March 17, 202507:40:22 AM

Megastar Chiranjeevi: తెలుగు రాష్ట్రాలకు చిరంజీవి ‘వరద’ సాయం.. ఎంత ప్రకటించాడంటే?

ప్రజలు కష్టాల్లో ఉంటే కామ్‌గా ఉంటే వాళ్లను హీరోలు అనరు. అందుకేనేమో మన స్టార్‌ హీరోలు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా తమ వంతు సాయంగా డబ్బులు అందిస్తుంటారు. సహాయక చర్యలకు ఆ డబ్బులు వినియోగించాలని కోరుతూ ఉంటారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. వర్షాలు, వదరల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఖమ్మం, ఉమ్మడి కృష్ణా జిల్లాలో తీవ్రంగా ఆస్తినష్టం జరిగింది. దీంతో నటులు తమవంతు విరాళాలు ఇస్తున్నారు.

Megastar Chiranjeevi

అలా మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) కూడా తన విరాళాన్ని ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల సహాయార్థం భారీ విరాళమిచ్చారు. రెండు రాష్ట్రాలకు కలిపి రూ.కోటి విరాళాన్ని ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్‌ (మాజీ ట్విటర్‌)లో పోస్ట్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయనిధికి చెరో రూ.50 లక్షలు ఇస్తున్నట్లు ఆ పోస్టులో పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం వల్ల ప్రజలకు కలిగిన, కలుగుతున్న కష్టాలు నన్ను కలచివేస్తున్నాయి అని చిరంజీవి (Megastar Chiranjeevi) ఆ పోస్టులో పేర్కొన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోవడం విషాదకరం. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నాయకత్వంలో రెండు ప్రభుత్వాలు శాయశక్తులా పరిస్థితిని మెరుగుపరచడానికి కృషి చేస్తున్నాయి. మనం కూడా ఏదోవిధంగా సహాయక చర్యల్లో పాలుపంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విపత్కర పరిస్థితులు తొందరగా తొలగిపోవాలని, ప్రజలు సురక్షితంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను అని చిరంజీవి (Megastar Chiranjeevi) పేర్కొన్నారు.

కాగా వరద బాధితులను ఆదుకునేందుకు సినిమా ఇండస్ట్రీ నుండి ఇప్పటికే చాలామంది ముందుకొచ్చారు. ‘ఆయ్’ (AAY) సినిమా టీమ్‌, వైజయంతి మూవీస్‌, తారక్‌ (Jr NTR), విశ్వక్ సేన్ (Vishwak Sen), సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda), మహేష్ బాబు (Mahesh Babu) , నందమూరి బాలకృష్ణ (Balakrishna ), పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan), త్రివిక్రమ్‌ (Trivikram) , నిర్మాత చినబాబు (Radha Krishna), వెంకటీ అట్లూరి (Venky Atluri) తదితరులు విరాళాలు అందించారు. ఎవరు స్థాయికి, తాహతుకు తగ్గట్టు వారు విరాళాలు అందించారు. మరోవైపు వరద బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి.

నాని కొత్త సినిమా.. అప్‌డేట్‌ వచ్చేస్తోంది.. ఎప్పుడంటే? ఏ సినిమా అంటే?

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.