March 19, 202511:24:11 AM

Mokshagnya: ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు కావాలంటున్న ఫ్యాన్స్.. ఏం జరిగిందంటే?

నందమూరి మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా మోక్షజ్ఞ (Mokshagnya) ఫస్ట్ మూవీ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) డైరెక్షన్ లో తెరకెక్కనుందని అధికారికంగా క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమాలో నటించే హీరోయిన్ ఎవరు? ఈ మూవీలో విలన్ ఎవరు? బాలయ్య  (Balakrishna) ఈ సినిమాలో నిజంగానే నటిస్తున్నారా? లేదా? అనే ప్రశ్నలకు జవాబులు దొరకాలంటే మాత్రం మరి కొంతకాలం ఆగాల్సిందేనని చెప్పవచ్చు. అయితే మోక్షజ్ఞ ఫస్ట్ లుక్ తో అభిమానుల్లో కొన్ని సందేహాలు మొదలయ్యాయి. మైథలాజికల్ టచ్ తో మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ తెరకెక్కనుందని వార్తలు వినిపిస్తుండగా ఫస్ట్ లుక్ లో ఇందుకు సంబంధించి ఎలాంటి క్లూ ఇవ్వలేదు.

Mokshagnya

Mokshagnya

ఈ సినిమా షూట్ ఎప్పటినుంచి మొదలవుతుంది? ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఈ సినిమా తెరకెక్కుతుండగా హనుమాన్ (Hanuman)   మూవీకి ఈ సినిమాకు ఏదైనా లింక్ ఉంటుందా? అనే ప్రశ్నలు సైతం సోషల్ మీడియా వేదికగా వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమా బడ్జెట్ కు సంబంధించిన వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి.

మరోవైపు ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఎప్పుడు జరుగుతాయనే ప్రశ్నలకు సంబంధించి సమాధానం దొరకాల్సి ఉంది. మోక్షజ్ఞ ఫస్ట్ సినిమాకు రెమ్యునరేషన్ తీసుకుంటారో లేక లాభాల్లో వాటా తీసుకుంటారో చూడాల్సి ఉంది. మోక్షజ్ఞ కెరీర్ ప్లానింగ్ ఏ విధంగా ఉండనుందో తెలియాల్సి ఉంది. మోక్షజ్ఞ లుక్స్ కు మాత్రం నెటిజన్లు ఫిదా అవుతున్నారు. స్లిమ్ లుక్ లో మోక్షజ్ఞ (Mokshagnya) బాగున్నాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

మోక్షజ్ఞ కథల విషయంలో బాలయ్య జోక్యం ఉందని బాలయ్య నిర్ణయం మేరకు ప్రాజెక్ట్ ల ఎంపిక జరగనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మోక్షజ్ఞ ఇకపై వేగంగా సినిమాలలో నటించాలని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. తొలి సినిమాతోనే పాన్ ఇండియా స్థాయి సినిమాలో మోక్షజ్ఞ నటిస్తుండగా తారక్  (Jr NTR) , కళ్యాణ్ రామ్  (Nandamuri Kalyan Ram)  సపోర్ట్ ఉండటం మోక్షజ్ఞకు (Mokshagnya) మరింత ప్లస్ కానుంది.

అలాంటి టాక్ రావాలంటున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఏం జరిగిందంటే?

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.