March 22, 202501:34:01 AM

Movies: వయసు తగ్గిస్తున్నారు.. వెరైటీ అంటున్నారు.. కానీ రియాలిటీ చూస్తే..

టెక్నాలజీ అనేది రెండు వైపులా వాడి ఉన్న కత్తి లాంటిది. హ్యాండిల్‌ చేయడంలో ఏ మాత్రం తేడా జరిగినా మనకే నష్టం. అలాంటి టెక్నాలజీని మన సినిమాల్లో వాడి విజయం సాధించిన వాళ్లూ ఉన్నారు, దెబ్బతిన్నవాళ్లూ ఉన్నారు. లేటెస్ట్‌గా అయితే రెండో రకం బ్యాచే కనిపిస్తున్నారు. ఆ టెక్నాలజీ ఏంటో చెప్పలేదు కదా.. అదే మోస్ట్‌ ట్రెండింగ్‌ అంశం డీఏజింగ్‌ టెక్నాలజీ. విజయ్‌  (Thalapathy Vijay) – వెంకట్‌ ప్రభు (Venkat Prabhu)   కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘ది గోట్‌’ (The Greatest of All Time) .

Movies

ఇటీవల విడుదలైన ఈ సినిమాలో (Movies) విజయ్‌ డ్యూయల్‌ రోల్‌లో కనిపించాడు. ఒక పాత్ర కోసం డీ ఏజింగ్‌ టెక్నాలజీ వాడి విజయ్‌ను కుర్రాడిలా చూపించారు. ఫలితం సంగతి పక్కన పెడితే విజయ్‌ లుక్‌ విషయంలో ఇబ్బందులు కొన్ని వచ్చాయి. దీంతో అసలు డీఏజింగ్‌ టెక్నాలజీ ఓకేనా అనే చర్చ మొదలైంది. ‘డీ ఏజింగ్‌ ’ టెక్నాలజీ పుట్టుపూర్వోత్తరాలు చూస్తే.. తొలిసారి 2006లో ‘Xమెన్: ది లాస్ట్ స్టాండ్’ సినిమాలో వాడారు.

తర్వాత చాలా సినిమాల్లో (Movies) వాడినా.. ఎక్కడా పెద్ద హంగామా చేయలేదు. ఇక మన దేశంలో అయితే షారుఖ్‌ ఖాన్ (Shah Rukh Khan) ‘ఫ్యాన్’ సినిమా కోసం తొలిసారి వాడారు. అలాగే ‘జీరో’లో (Zero) కూడా వాడారు. ఇక తెలుగులో వచ్చేసరికి చిరంజీవి ((Chiranjeevi) ‘ఆచార్య’ (Acharya) కోసం డీఏజింగ్ వాడారు. ఇక రీసెంట్‌గా అయితే ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) సినిమాలో యంగ్ అమితాబ్ బచ్చన్‌ను (Amitabh Bachchan) చూపించడానికి ఈ టెక్నాలజీ ఉపయోగించారు. డీ ఏజింగ్‌ రూపంలో, డైలాగ్‌ డెలివరీలో ఇబ్బందులు వస్తాయి.

అందుకే సహజత్వం లోపిస్తుంది. దీంతో ప్రేక్షకులు కనెక్ట్‌ కారు అని సినిమా (Movies) పరిశీలకులు అంటున్నారు. అనుకున్నట్లుగా ఇలా వచ్చిన సినిమాలు చాలావరకు నెగిటివ్‌ ఫలితాన్నే అందుకున్నాయి. అలా అని అన్నీ అలానే ఇబ్బంది పెట్టాయా అంటే ఏదో ఒకట్రెండు సన్నివేశాలు ఉన్న సినిమాలు ఆకట్టుకున్నాయి. మొత్తంగా ఈ టెక్నాలజీ మీద ఆధారపడి సన్నివేశాలకు సన్నివేశాలు తీసుకున్న సినిమాలు తేడా కొట్టాయి. అయితే టెక్నాలజీ ఇంకా అభివృద్ధి చెందాలి లేదంటే ప్రేక్షకులు అలవాటుపడాలి. లేదంటే ఇబ్బందే.

‘బచ్చల మల్లి’ స్టోరీలో ‘సరిపోదా’ పోలికలు నిజమేనా?

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.