
అక్కినేని అఖిల్ (Akhil Akkineni) హీరోగా ఎంట్రీ ఇచ్చి 9 ఏళ్ళు పూర్తి కావస్తోంది. హీరోగా అతను 5 సినిమాలు చేశాడు. వీటిలో ‘హలో’ (Hello)’మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ (Most Eligible Bachelor) వంటి సినిమాలు బాగానే ఆడాయి. తొలి సినిమా ‘అఖిల్’ (Akhil) కి రికార్డ్ ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ అక్కినేని అభిమానులు ఆశించిన హిట్ అఖిల్ నుండి ఇంకా రాలేదు. ‘ఏజెంట్’ (Agent) వచ్చి ఏడాది దాటినా.. ఎందుకో అతని నెక్స్ట్ సినిమా ఏంటన్నది ఇంకా ప్రకటించలేదు. ‘యూవీ క్రియేషన్స్’ లో ఓ సినిమా చేయాలి.
Nagarjuna
అనిల్ అనే నూతన దర్శకుడు ఆ సినిమాతో ఎంట్రీ ఇవ్వాల్సి ఉంది. కానీ బడ్జెట్ లెక్కల వల్ల ఆ ప్రాజెక్టు డిలే అవుతున్నట్టు వినికిడి. ఇదిలా ఉంటే.. ఈరోజు దివంగత అక్కినేని నాగేశ్వరరావు జయంతి. ఇంకో స్పెషాలిటీ ఏంటంటే.. ఇది అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswara Rao) గారి వందవ జయంతి. ఇక ఆయన శతజయంతి ఉత్సవాలను అభిమానులు సమక్షంలో అన్నపూర్ణ స్టూడియోస్ లో ఏర్పాటు చేశారు నాగ్ (Nagarjuna) అండ్ టీం. నాగ చైతన్య (Naga Chaitanya) , సుశాంత్ (Sushanth Anumolu) , సుప్రియ (Supriya Yarlagadda), సుమంత్ (Sumanth) వంటి వాళ్ళు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
కానీ ఈ వేడుకల్లో అఖిల్ కనిపించలేదు. దీంతో అభిమానులు అంతా అతని పేరుతో గట్టిగా అరిచారు. నాగ్ ప్రసంగిస్తున్న టైంలో ఈ అరుపులు ఇంకా ఎక్కువవడంతో.. ఆయన దీనికి కారణం చెప్పక తప్పలేదు. ‘నేను హిట్టు కొట్టేవరకు అభిమానులు ముందుకు రాను, ఎక్కడా కనపడను అని అఖిల్ చెప్పాడు’ అంటూ నాగ్ అభిమానులకి చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మీరు కూడా ఓ లుక్కేయండి :
#Nagarjuna about #Akhil #NagarjunaAkkineni #AkhilAkkineni pic.twitter.com/eeW5RpHU5r
— Filmy Focus (@FilmyFocus) September 20, 2024