Neha Shetty: నెట్టింట హల్ చల్ చేస్తున్న నేహా శెట్టి గ్లామరస్ ఫోజులు.!

అప్పట్లో సూర్యకాంతం అనే పేరు తమ పిల్లలకు పెట్టడానికి చాలా మంది భయపడేవారట. ఆ పేరుకి అలాంటి ఇమేజ్ ను తెచ్చిపెట్టారు సూర్యకాంతం గారు. అదే తరహాలో “రాధిక” అనే పేరుకి ఒక ఇమేజ్ తీసుకువచ్చింది నేహా శెట్టి (Neha Shetty). క్రెడిట్స్ రైటర్ సిద్ధు జొన్నలగడ్డకి (Siddu Jonnalagadda) చెందినవే అయినప్పటికీ.. ఆ పాత్రను పోషించిన నేహా శెట్టి మాత్రం అందరికీ “రాధిక”గా దగ్గరైపోయింది. ఆమెను జనాలు కూడా నేహా కంటే రాధికగానే బాగా గుర్తిస్తారు. అటువంటి నేహాశెట్టి “గ్యాంగ్ ఆఫ్ గోదావరి” (Gangs of Godavari)  అనంతరం కాస్త నెమ్మదించింది.

Neha Shetty

ప్రస్తుతం ఆమె నటిస్తున్న భవిష్యత్ ప్రాజెక్టుల విషయంలో ఇంకా క్లారిటీ లేదు. అయితే.. నిన్న సాయంత్రం నుండి నేహా శెట్టి మరోసారి తన అందాలతో ఇంటర్నెట్ ను రూల్ చేస్తోంది. “సైమా అవార్డ్స్” ఈవెంట్ కి గెస్ట్ గా వెళ్లిన నేహా శెట్టి అక్కడ తన గ్లామర్ తో దుమ్ము లేపుతోంది. యద లోతులను కాస్తంత బహిర్గత పరుస్తూ కుర్రకారును హృదయాలను వేడెక్కించింది. సదరు ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరి ఈ కొత్త ఫోటోలు, రీల్స్ ఆమెకు సరికొత్త ఆఫర్లు ఏమైనా తెచ్చిపెడతాయేమో. ఇకపోతే.. మొన్నామధ్య కొన్ని సినిమాల విషయంలో ఆమె పేరు వినిపించినప్పటికీ.. చివరికి ఆమెను వేరే హీరోయిన్లు రీప్లెస్ చేయడం జరిగింది. నిజానికి కన్నడ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నేహా శెట్టికి అక్కడ కనీస స్థాయి గుర్తింపు రాకపోయినా తెలుగులో మాత్రం వరుస ఆఫర్లు వచ్చాయి. ఇక “డీజే టిల్లు” (Dj Tillu)  తో ఆమె ఫేమ్ ఏ స్థాయిలో పెరిగిపోయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.

ఆ ఒక్క సినిమాను బేస్ చేసుకొని మాల్స్ ఓపెనింగ్స్ అనీ, ఇన్స్టాగ్రామ్ కొలాబరేషన్స్ అనీ విపరీతంగా సంపాదించింది నేహా శెట్టి (Neha Shetty). అయితే.. ఆమెకు అర్జెంటుగా ఒక ప్రాజెక్ట్ అవసరం, అది కూడా ఒక మంచి హీరో సరసన కనిపించడం ఇంకా అవసరం. మరి ఆమెను ఏ దర్శకుడు/హీరో ఆడుకుంటాడో చూడాలి.

‘దేవర’ రిజల్ట్ తో సంబంధం లేకుండా..జాన్వీకి అదొక ప్లస్ పాయింట్.!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.