March 17, 202503:24:05 AM

Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్… మర్చిపోలేని డేట్ ఇది.. ఏమైందంటే?

సినీ పరిశ్రమ అంటేనే సెంటిమెంట్లకు పెద్ద పీట వేసే పరిశ్రమ అని చెప్పాలి. కొబ్బరికాయ కొట్టినప్పటి నుండి(ఓపెనింగ్ నుండి) గుమ్మడికాయ(షూట్ ఎండ్) వరకు చాలా విషయాలు సెంటిమెంట్లతోనే ముడిపడి ఉంటాయి. అభిమానులకు కూడా తమ అభిమాన హీరో సినిమాల విషయంలో చాలా సెంటిమెంట్లు ఉంటాయి. ఒక్కోసారి ఇవి వారిని భయపెడుతూ ఉంటాయి కూడా. ముఖ్యంగా కొన్ని విషయాల్లో హీరోల సినిమాలు వర్కౌట్ కాలేదు అంటే.. మళ్ళీ వాటి జోలికి పోవద్దు అంటూ గోల పెడుతుంటారు.

Pawan Kalyan

పవన్ కళ్యాణ్ కి (Pawan Kalyan)  కూడా ఓ డేట్ అస్సలు కలిసి రాలేదట. ఒకే డేట్ కి వచ్చిన పవన్ కళ్యాణ్ 2 సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచినట్టు ఇప్పుడు డిస్కషన్స్ మొదలయ్యాయి. విషయంలోకి వెళితే.. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)

హీరోగా గుడుంబా శంకర్’  (Gudumba Shankar) సినిమా రూపొందిన సంగతి తెలిసిందే.2004 సెప్టెంబర్ 10న రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. ‘జానీ’ (Johnny) తర్వాత పవన్ నుండి వచ్చిన సినిమా ఇది. ఆ డిజాస్టర్ రిజల్ట్ ని మరిపిస్తుందేమో అని అంతా భావించారు.

కానీ వర్కౌట్ కాలేదు. మళ్ళీ 6 ఏళ్ళకి అంటే 2010 సెప్టెంబర్ 10 కి(సేమ్ డేట్ కి) ‘కొమరం పులి’ రిలీజ్ అయ్యింది. ఇది అయితే పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో ఒకటిగా మిగిలింది. సో సెప్టెంబర్ 10 అనేది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఓ పీడకల వంటి డేట్ అని చెప్పాలి. ఈరోజుతో ‘గుడుంబా శంకర్’ రిలీజ్ అయ్యి 20 ఏళ్ళు పూర్తి కావస్తోంది. ఇక ‘కొమరం పులి’ (Komaram Puli) రిలీజ్ అయ్యి 14 ఏళ్ళు పూర్తి కావస్తోంది.

 గేమ్ ఛేంజర్ లో ఆర్ఆర్ఆర్ రేంజ్ యాక్షన్ సీన్.. ఆ సీన్ హైలెట్ అంటూ?

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.