March 22, 202503:01:38 AM

Prabhas: ప్రభాస్ సరసన ముదురు హీరోయిన్లు.. అందుకోసమేనా?

ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం రాజా సాబ్ (The Rajasaab)  సినిమాతో బిజీగా గడుపుతున్నారు. దర్శకుడు మారుతి (Maruthi Dasari) … ప్రభాస్ పై కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. మరో 4 రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్లో ప్రభాస్ పాల్గొనాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రభాస్..కి కొంత బ్రేక్ లభిస్తుంది. అదే టైంలో ఫౌజీ సినిమా షూటింగ్లో పాల్గొనాలని ప్రభాస్ భావిస్తున్నాడు. ఇదిలా ఉండగా.. ఈ రెండు సినిమాలు కంప్లీట్ అయ్యాక ప్రభాస్ ఏ సినిమా చేస్తాడు అనే డౌట్ చాలా మందిలో ఉంది.

Prabhas

‘సలార్ 2’ (Salaar)  ‘కల్కి 2’  (Kalki 2898 AD)   వంటి సినిమాలు ప్రభాస్ కంప్లీట్ చేయాలి. అయితే వాటి కంటే ముందుగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి ప్రభాస్ రెడీ అవుతున్నాడట. ‘స్పిరిట్’ అనే టైటిల్ తో ఈ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రభాస్ కోపిష్టి పోలీసోడుగా కనిపిస్తాడని కూడా దర్శకుడు సందీప్ (Sandeep Reddy Vanga) పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు.

తాజాగా ఈ ప్రాజెక్టు గురించి ఇంకో ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. అదేంటంటే.. సందీప్ రెడ్డి వంగా సినిమాలో ప్రభాస్ ఓ మిడిల్ ఏజ్డ్ రోల్లో కనిపిస్తాడట. భార్య, బిడ్డలతో కలిసి జీవించే పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ కనిపిస్తాడని తెలుస్తుంది. అందుకోసమే ‘స్పిరిట్’ కోసం ఓ సీనియర్ హీరోయిన్ ను ఎంపిక చేసుకోబోతున్నారని సమాచారం. ప్రస్తుతం సోషల్ మీడియాలో త్రిష (Trisha) , మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur), కరీనా కపూర్ (Kareena Kapoor)  వంటి హీరోయిన్లు ప్రభాస్ ‘స్పిరిట్’ లో చేస్తున్నట్లు ప్రచారం జరిగింది.

త్రిష, మృణాల్.. వంటి వారిని పక్కన పెట్టేస్తే కరీనా కపూర్ ని సందీప్ సంప్రదించినట్లు బీ-టౌన్ టాక్. ఇక మిడిల్ ఏజ్డ్ లుక్ లో ప్రభాస్ కనిపిస్తాడు అంటే.. సినిమాలో డబుల్ రోల్ చేస్తాడా? లేక యానిమల్ (Animal) లో రణబీర్ కపూర్ (Ranbir Kapoor)..పాత్ర మాదిరి షేడ్స్ ఉంటాయా అనేది తెలియాల్సి ఉంది.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.