March 17, 202509:41:06 PM

Prerana Kambam: ‘బిగ్ బాస్ 8’ కంటెస్టెంట్ ప్రేరణ గురించి ఎవ్వరికీ తెలియని విషయాలు.!

బిగ్ బాస్ 8 రెండు రోజుల క్రితం గ్రాండ్ గా ప్రారంభమైంది. ఈసారి ఏదైనా అన్ లిమిటెడ్ అంటూ హోస్ట్ నాగార్జున (Nagarjuna) … కంటెస్టెంట్లలో ధైర్యం నింపి హౌస్లోకి పంపించాడు. ఈసారి ఒక్కొక్కరిగా కాకుండా బడ్డీస్ అంటూ ఇద్దరిద్దరిని హౌస్ లోపలికి పంపడం అనేది విశేషంగా చెప్పుకోవాలి. ఈ క్రమంలో బిగ్ బాస్ 8 లోకి 4వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది ప్రేరణ (Prerana Kambam) . ఈమె కూడా బుల్లితెర ప్రేక్షకులకి సుపరిచితమే. కన్నడ నటే అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఈమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం :

Prerana Kambam

1996 జూన్ 18న ఈమె (Prerana Kambam) జన్మించింది. పుట్టింది హైదరాబాద్లోనే అయినప్పటికీ పెరిగింది ఎక్కువగా కర్ణాటకలోనే కావడం గమనార్హం.

2017 లో ఈమె కన్నడ సీరియల్ ‘హర హర మహాదేవ్’ తో నటిగా మారింది. ఆ తర్వాత ‘రంగనాయకి’ అనే సీరియల్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

2018 లో ఈమె ‘చురకత్తె’ అనే కన్నడ సినిమాలో నటించింది. తర్వాత ‘ఫిజిక్స్ టీచర్’ ‘పెంటగాన్’ వంటి సినిమాల్లో కూడా నటించింది.

2021 లో ఈమె (Prerana Kambam) కన్నడ బిగ్ బాస్ లో కూడా పాల్గొంది. తెలుగులో ఈమె ‘కృష్ణ ముకుంద మురారి’ అనే సీరియల్లో కూడా నటించింది.

మరి ‘బిగ్ బాస్ 8’ లో ఈమె ఎంతవరకు రాణిస్తుందో చూడాలి.

 ‘బిగ్ బాస్ 8’ కంటెస్టెంట్ నిఖిల్ మలియక్కల్ గురించి ఎవ్వరికీ తెలియని విషయాలు?

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.