March 21, 202501:51:04 AM

Rakul Preet Singh: ఇలా కూడా బ్రేకప్‌ చెబుతారా? రకుల్‌ అయితే చెప్పేసింది!

ప్రేమ పుట్టుకకు చాలా కారణాలు ఉంటాయి. అందుకే ప్రేమ ఎలా పుడుతుందో చెప్పలేం అంటారు. అలాగే ఆ ప్రేమ బ్రేకప్‌కు దారి తీయడానికి కూడా చాలా కారణాలు ఉంటాయి. అందుకే బ్రేక్‌ బహు రకములు అని అంటుంటారు. ఇలాంటి వాటిలో ఒక దాని గురించి ప్రముఖ కథానాయిక రకుల్‌ ప్రీత్‌ (Rakul Preet Singh) చెప్పుకొచ్చింది. తన బ్రేకప్‌ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. దీంతో ఇప్పుడు ఆ విషయాలు వైరల్‌గా మారాయి.

Rakul Preet Singh

తన భర్త జాకీ భగ్నానీని కలిశాక తన జీవితంలో చాలా మార్పులు వచ్చాయని చెప్పిన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌.. ఈ క్రమంలో తనకు బంధం విలువ తెలిసిందని చెప్పారు. ఈ క్రమంలో గతంలో జరిగిన ఓ సంఘటన గురించి చెప్పింది. గతంలో ఓసారి వేయించిన వంటకాన్ని ఆర్డర్‌ చేసినందుకు ఓ వ్యక్తిని రిజెక్ట్‌ చేసినట్లు రకుల్‌ చెప్పింది. అయితే అతడు ఎవరు అనే విషయాన్ని మాత్రం ఆమె చెప్పలేదు.

గతంలో ఓ వ్యక్తితో రిలేషన్‌లో ఉన్నప్పుడు హోటల్‌కు వెళ్తే తన కోసం అతడు వేయించిన వంటకాన్ని ఆర్డర్‌ చేశాడట. అయితే అది రకుల్‌కు నచ్చలేదట. అందుకే బ్రేకప్‌ చెప్పేశాను అని చెప్పింది. నాకంటూ కొన్ని ఆహారపు అలవాట్లు ఉంటాయి కదా. కానీ నేను ఆర్డర్‌ చేసిన ఆహారాన్ని ఆ వ్యక్తి తక్కువ చేసి చూశాడు. దీంతో భోజనాన్ని, జీవనశైలిని పంచుకోలేని వ్యక్తి నాకెందుకు అనిపించి బ్రేక్‌ చెప్పా అని రకుల్‌ తెలిపింది.

ఆహారం విషయంలో తాను ప్రత్యేక శ్రద్ధ చూపిస్తానని, ఎంతో గౌరవిస్తానని చెప్పిన రకుల్‌.. ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఆహారంలో మార్పులు చేసి తిరిగి ఆరోగ్యవంతంగా మారుతానని రకుల్‌ తన హెల్త్‌ సీక్రెట్‌చెప్పింది. ఓసారి ఆరోగ్యం కోసం ఏడాది పాటు శాకాహార భోజనమే తిన్నానని గుర్తు చేసింది రకుల్‌. బాలీవుడ్‌లో రీఎంట్రీ ఇచ్చిన సమయంలో కామన్‌ ఫ్రెండ్స్‌ ద్వారా జాకీ భగ్నానీ పరిచయం అయ్యాడని, మూడేళ్లు ప్రేమలో ఉన్న తర్వాత ఇరు కుటుంబాల అంగీకారంతో ఈ ఏడాది ఫిబ్రవరి 21న పెళ్లి జరిగిందని చెప్పింది.

మెగా సెంటిమెంట్ కలిసొస్తే దేవర బ్లాక్ బస్టర్.. ఏం జరిగిందంటే?

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.