March 23, 202506:45:04 AM

Sudheer Babu: హరోంహర ఫ్లాప్ పై సుధీర్ బాబు రియాక్షన్ ఇదే.. ఏం చెప్పారంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న హీరోలలో సుధీర్ బాబు  (Sudheer Babu) ఒకరు కాగా సుధీర్ బాబుకు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది. సుధీర్ బాబు గత సినిమా హరోంహర బాక్సాఫీస్ వద్ద ఆశించిన రేంజ్ లో హిట్ కాలేదు. సుధీర్ బాబు ఈ సినిమా కోసం ఎంతో కష్టపడినా ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని సొంతం చేసుకోలేదు. ఈ సినిమా రిజల్ట్ గురించి తన తాజా మూవీ మా నాన్న సూపర్ హీరో (Maa Nanna Superhero) టీజర్ రిలీజ్ ఈవెంట్ లో సుధీర్ బాబు స్పందించారు.

Sudheer Babu

హరోంహర(Harom Hara)  సినిమాతో ప్రేక్షకులకు థియేట్రికల్ ఎక్స్ పిరీయన్స్ ఇవ్వాలనుకున్నామని ఆయన అన్నారు. ఈ విషయంలో మేము అనుకున్నది సాధించామని సుధీర్ బాబు తెలిపారు. ఒక సినిమాను 10 మంది చూస్తే అందరికీ ఆ సినిమా నచ్చాలని లేదని ఆయన వెల్లడించారు. కొందరికి మాత్రమే మూవీ నచ్చుతుందని హరోం హర మూవీ కూడా కొంతమందికి నచ్చిందని సుధీర్ బాబు అన్నారు.

హరోం హర సినిమా విడుదలైన తర్వాత నేను జటాధర సినిమాకు సైన్ చేశానని ఆయన తెలిపారు. నాకింకా సినిమా అవకాశాలు వస్తున్నాయంటే నా సినిమాలను కొందరు ఇష్టపడుతున్నారని భావిస్తున్నానని సుధీర్ బాబు తెలిపారు. ఏ హీరోకైనా సినిమా ఫ్లాప్ రిజల్ట్ ను అందుకుంటే ఇబ్బందేనని ఆయన అన్నారు. మూవీ ఫ్లాపైన ప్రతి సందర్భంలో కొంతమంది హీరోలు చేసే సినిమాలను చూసి నేను స్పూర్తి పొందుతానని సుధీర్ బాబు చెప్పుకొచ్చారు.

మా నాన్న సూపర్ హీరో సినిమాతో సుధీర్ బాబు ఎలాంటి రిజల్ట్ అందుకుంటారో చూడాల్సి ఉంది. సుధీర్ బాబు తర్వాత సినిమాలు సైతం సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సుధీర్ బాబు రేంజ్ అంతకంతకూ పెరుగుతుండగా ఈ హీరో సినిమాలు ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. కథల ఎంపికలో సైతం సుధీర్ బాబు వైవిధ్యం చూపిస్తున్నారు.

‘భలే ఉన్నాడే’ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.