March 25, 202512:25:04 PM

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్‌’లోనూ ‘అంత్యాక్షరి’.. అంచనాలు పెంచేసిన హరీశ్‌ శంకర్‌

గేమ్‌ షోస్‌లో కాన్సెప్ట్‌ పోస్టర్‌ పెట్టి.. పక్కన పేరు పెట్టి ఠక్కున గుర్తుపట్టండి అని అంటుంటారు. ఇలా ‘గబ్బర్‌ సింగ్‌’ (Gabbar Singh)  సినిమా గురించి ఏదైనా ఒక పోస్టర్‌ చూపించాలి అంటే అందులో కచ్చితంగా అంత్యాక్షరి కచ్చితంగా పెట్టేయొచ్చు. అంతలా ఆ సినిమాలో అంత్యాక్షరి సన్నివేశం ఫేమస్‌. ఇప్పుడు దీని గురించి చర్చ ఎందుకు అనుకుంటున్నారా? ఆ కాంబినేషన్‌లో రూపొందుతున్న కొత్త సినిమాలోనూ అదే తరహా సన్నివేశం ఉంటుంది అంటున్నారు.

Ustaad Bhagat Singh

రాజకీయాల్లోకి వచ్చాక, ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యాక పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) మూడు సినిమాలను హోల్డ్‌లో పెట్టారు. త్వరలో షూటింగ్‌ అంటున్నారు కానీ.. ఎప్పడు ప్రారంభిస్తారో తెలియడం లేదు. ఆ విషయం పక్కనపెడితే హోల్డ్‌లో ఉన్న ఓ సినిమా ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’. ఈ సినిమా గురించి దర్శకుడు హరీశ్‌ శంకర్‌  (Harish Shankar)  ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘గబ్బర్ సింగ్’ సినిమాలోని అంత్యాక్షరి సన్నివేశం తరహాలో ఒక ఎపిసోడ్ ఉందని హింట్‌ ఇచ్చారు.

అంతేకాదు ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’  (Ustaad Bhagat Singh)  సినిమా వచ్చినపుడు థియేటర్లు షేక్ అయిపోతాయని అంటున్నారు హరీశ్‌ శంకర్‌. అయితే అంత్యాక్షరి టైప్ కాదు కానీ.. ఒక మ్యూజిక్ టచ్ ఉన్న ఎపిసోడ్ అట. ఇక ‘గబ్బర్ సింగ్’లో అంత్యాక్షరి ఎపిసోడ్‌ను చాలా సినిమాల్లో ట్రై చేసినా అవి వర్కవుట్ కాలేదని ఆయన దగ్గర ప్రస్తావించగా.. అందరికీ వర్కవుట్‌ అవ్వదు అనే తరహాలో హరీశ్‌ సమాధానం ఇచ్చారు.

అయితే మరిప్పుడు ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ సినిమాలో ఆ సన్నివేశం తెరకెక్కించారా? లేక షూట్‌ చేయాల్సి ఉందా అనేది తెలియాలి. అయితే సినిమా హోల్డ్‌లోకి వెళ్లే ముందు చేసిన చిత్రీకరణలో పోలీసు స్టేషన్‌ సీన్స్‌ కొన్ని షూట్‌ చేసిన సంగతి విదితమే. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల (Sreeleea) హీరోయిన్‌. తమిళంలో మంచి విజయం అందుకున్న ‘తెరి’ సినిమాకు ఇది రీమేక్‌. అయితే సెకండాఫ్‌ మాత్రమే ఆ సినిమా నుండి తీసుకున్నారు అంటున్నారు.

తమ్ముడికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన చిరు.. అద్భుతాలు జరగాలంటూ?

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.