March 20, 202511:35:51 PM

Venu Yeldandi: నాని, శర్వానంద్ రిజెక్ట్ చేస్తే ఆ యంగ్ హీరో ఫైనల్ చేశాడా?

‘జబర్దస్త్’ కమెడియన్ వేణు ఎల్దిండి (Venu Yeldandi) దర్శకుడిగా మారి ‘బలగం’ (Balagam) అనే సినిమా చేశాడు. పెద్దగా అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా ఊహించని విధంగా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. ‘దిల్ రాజు ప్రొడక్షన్స్’ బ్యానర్ పై, దిల్ రాజు (Dil Raju) సమర్పణలో హర్షిత్ రెడ్డి (Harshith Reddy), హన్షిత రెడ్డి (Hanshitha Reddy)..లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలంగాణ గ్రామాల్లో చావు, దాని తర్వాత జరిగే కార్యక్రమాలను ఈ సినిమాలో చాలా ఎమోషనల్ గా చూపించాడు వేణు. ముఖ్యంగా ‘కాకి’ చుట్టూ అల్లిన కథ కూడా అందరికీ కనెక్ట్ అయ్యింది.

Venu Yeldandi

అందుకే తెలంగాణ గ్రామాల్లో ఈ చిత్రాన్ని ఎగబడి చూశారు. ఒకప్పుడు ‘వీధి బొమ్మ’..ల సంస్కృతిని మరోసారి అందరికీ తెలియజేసింది ‘బలగం’ చిత్రం. అలాగే దిల్ రాజుకి బోలెడన్ని అవార్డులు తెచ్చిపెట్టింది. ఇక ‘బలగం’ తర్వాత వేణు డైరెక్టర్ గా బిజీ అయిపోతాడు అని అందరూ భావించారు. అతని వద్ద కథ కూడా రెడీగా ఉంది కానీ.. ఇంకా ప్రాజెక్టు ఓకే కాలేదు. ‘బలగం’ తర్వాత ‘ఎల్లమ్మ’ అనే కథ రాసుకున్నాడు వేణు. నానితో (Nani) చేద్దామని అనుకున్నాడు.

నానికి కథ అయితే నచ్చింది కానీ.. ఎందుకో అతను ఓకే చేయలేదు. తర్వాత శర్వానంద్ ని ( Sharwanand) కూడా అప్రోచ్ అయ్యాడు అని తెలుస్తుంది. అతను కూడా కొన్ని కారణాల వల్ల నో చెప్పాడట. ఈ క్రమంలో తేజ సజ్జని అప్రోచ్ అయ్యాడట వేణు. దిల్ రాజు కూడా తేజని రెండు, మూడు సార్లు కలిసి ఈ కథ గురించి తేజ సజ్జకి (Teja Sajja) వివరించడం జరిగిందట. కాబట్టి తేజ సజ్జ.. సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

‘ఎల్లమ్మ’ కూడా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల చుట్టూ నడిచే కథ అని తెలుస్తుంది.ఫాంటసీ ఎలిమెంట్ కూడా ఉంటుందట. యాక్షన్ ఎలిమెంట్స్, డివోషనల్ టచ్ కూడా ఉంటుందట. చివరి 30 నిమిషాల్లో హీరో… కొమురవెల్లి మల్లన్న గెటప్ లో కనిపించి ఫైట్ చేస్తాడని… అది సినిమాకి హైలెట్ గా ఉంటుందని…. ‘కాంతార’ రేంజ్లో పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ సాధించే దమ్ము ‘ఎల్లమ్మ’ కథలో ఉందని దిల్ రాజు బలంగా నమ్ముతున్నారట.అందుకే ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్లోనే ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాలని ఆయన భావిస్తున్నట్టు సమాచారం.

వైరల్ అవుతున్న డీవీవీ దానయ్య కామెంట్స్.. చరణ్ గ్రేట్ యాక్టర్ అంటూ?

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.