March 17, 202510:13:47 PM

7th Sense Collections: ‘7th సెన్స్’ కి 13 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) తెలుగులో కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. కెరీర్ ప్రారంభం నుండి వైవిధ్యమైన సినిమాలు చేస్తూ వస్తున్నారు సూర్య. అయితే మురుగదాస్ దర్శకత్వంలో సూర్య చేసిన ‘గజిని’ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. ఆ ఒక్క సినిమాతో తెలుగులో మంచి మార్కెట్ ఏర్పరుచుకున్నాడు సూర్య. ఇక మురుగదాస్ (A.R. Murugadoss) తో సూర్య చేసిన రెండో సినిమా ‘7th సెన్స్’ (7th Sense). 2011 అక్టోబర్ 26 న విడుదలైన ఈ చిత్రం విడుదలై 13 ఏళ్ళు పూర్తి కావస్తోంది.

7th Sense Collections:

ఈ సినిమాలో రెండు రకాల షేడ్స్ కలిగిన పాత్రలో సూర్య నటన సూపర్ అనే చెప్పాలి. హారీష్ జయరాజ్ (Harris Jayaraj) సంగీతం కూడా సూపర్ గా ఉంటుంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం (7th Sense) ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :

నైజాం 5.45 cr
సీడెడ్ 2.85 cr
ఉత్తరాంధ్ర 1.25 cr
ఈస్ట్ 0.85 cr
వెస్ట్ 0.78 cr
కృష్ణా 1.42 cr
గుంటూరు 0.89 cr
నెల్లూరు 0.55 cr
ఏపీ + తెలంగాణ 14.04 కోట్లు (షేర్)

‘7th సెన్స్’ (7th Sense) తెలుగు రాష్ట్రాల్లో రూ.10 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. అయితే ఫుల్ రన్ ముగిసేసరికి ఏకంగా రూ.14 కోట్ల షేర్ ను రాబట్టి.. సూపర్ హిట్ గా నిలిచింది. వరల్డ్ వైడ్ గా ఈ సినిమా యావరేజ్ అనిపించినప్పటికీ.. తెలుగు వెర్షన్ మాత్రం సూపర్ హిట్ గా నిలిచింది అని చెప్పాలి. త్వరలో రిలీజ్ కానున్న ‘కంగువా’ తో సూర్య మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొడతాడేమో చూడాలి.

ఆనంద్ దేవరకొండ ఏం చేస్తున్నాడు?

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.