
‘ఓజీ’ (OG Movie) సినిమా మొదలై.. పుణెలో షూటింగ్ జరుగుతోంది అనే మేటర్ బయటకు వచ్చింది మొదలు అందరూ మాట్లాడుకున్న అంశం ‘ఓజీ’లో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తనయుడు అకిరా నందన్ ఉన్నాడా? అని. కొందరైతే ఉన్నాడు అని తీర్మానించేశారు కూడా. అకిరా (Akira Nandan) కోసం పుణెలో షూటింగ్ పెట్టుకున్నారు అంటూ ఓ లెక్క కూడా వేసేశారు. అయితే అలాంటిదేం లేదు అని టీమ్ నుండి ఇన్‌డైరెక్ట్‌గా క్లారిటీ వస్తూ వచ్చాయి. కానీ ‘అకీరా ఇన్ ఓజీ’ పుకార్లు మాత్రం ఆగడం లేదు.
Akira Nandan
తాజాగా ‘ఓజీ’ సినిమా షూటింగ్ ఫుటేజ్ అంటూ ఓ వీడియో బయటకు వచ్చింది. అందులో ఓ కుర్రాడు కనిపిస్తున్నాడు. అది అకిరానేనని, సినిమాలో చిన్ననాటి పవన్ కల్యాణ్‌గా అకిరా కనిపిస్తాడు అని ఆ వీడియోను వైరల్ చేస్తూ వార్తలు అల్లేస్తున్నారు ఔత్సాహికులు. దీంతో ఆ వీడియో, ఈ వార్త వైరల్‌గా మారిపోయాయి. నిజానికి ఆ వీడియోలో ఉన్నది అకిరా కాదు అని అర్థమవుతోంది. కానీ పవన్ ఫ్యాన్స్ మాత్రం ‘మేం ఒప్పుకోం ఆ కుర్రాడు అకిరానే’ అంటున్నారు.
‘ఓజీ’ సినిమా షూటింగ్‌కు సంబంధించి ఇప్పటివరకు బయటకు ఎలాంటి లీకులు రాలేదు. దానికి కారణం సినిమా షూటింగ్ ఎక్కువ సమయం రామోజీ ఫిలింసిటీలోనే జరుగుతోంది. అందులో రాత్రి సమయాల్లోనే ఎక్కువగా చేస్తున్నారు. ఉదయం పూట చేసిన షూటింగ్ ఎక్కువగా ఇండోర్‌లోనే జరిగిందట. అలా కాకుండా ఇతర రాష్ట్రాల్లో జరిగిన షూటింగ్‌లో ఒకటో, రెండో క్లిప్‌లు వచ్చాయి. మరి ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియో నిజమేనా అంటే లేదు అనే మాటే వినిపిస్తోంది.
ఇక సినిమా సంగతి చూస్తుంటే ఇటీవల చిత్రీకరణ మొదలైంది. పవన్ కల్యాణ్ లేని సన్నివేశాలను శరవేగంగా తెరకెక్కిస్తున్నారు. త్వరలో పవన్ కూడా సినిమా షూటింగ్‌లో జాయిన్ అవుతాడు అని అంటున్నారు. పవన్ వచ్చాక సినిమా గురించి మరింత క్లారిటీ వస్తుంది అని చెబుతున్నారు. సినిమా రిలీజ్ డేట్ విషయంలో కూడా అప్పుడే తేలుతుంది అని చెబుతున్నారు.
AKIRA NANDAN In OG #TheyCallHimOG #TVKmannadu pic.twitter.com/OERNSK610d
— ram (@ramchinna5) October 26, 2024