March 16, 202501:29:04 PM

Amala Paul: అమలా పాల్ బోల్డ్ లుక్.. ఇలా షాక్ ఇచ్చిందేంటీ?

Amala Paul

సౌత్ ఇండస్ట్రీలో పాపులర్ హీరోయిన్‌గా పేరుతెచ్చుకున్న అమలా పాల్ (Amala Paul) , తన యాక్టింగ్ టాలెంట్‌తో పాటు అందచందాలతో కూడా ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. ‘నీలి తామర’ సినిమాతో నటన ప్రారంభించిన ఆమె, దక్షిణాది సినీ ప్రపంచంలో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. కెరీర్ మధ్యలో వ్యక్తిగత సమస్యలు ఎదురైనా, వాటిని అధిగమించి మళ్లీ ఫుల్ ఫోకస్ తో సినిమాలు చేస్తూ సత్తా చాటుతోంది. ఇటీవలే తల్లిగా మారిన అమలా పాల్, తన కొత్త పాత్రను పూర్తిగా ఆస్వాదిస్తూ, కొంతకాలం సినిమాలకు విరామం తీసుకుంది.

Amlaa Paul

ప్రస్తుతం ఎక్కువ సమయం తన బిడ్డతో గడుపుతూనే, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తరచూ తన పర్సనల్ మరియు ప్రొఫెషనల్ విషయాలను అభిమానులతో పంచుకుంటూ, ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది. తాజాగా అమలా పాల్ (Amala Paul) తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని బోల్డ్ ఫొటోలు షేర్ చేసి హీట్ పెంచేసింది. ఈ బోల్డ్ లుక్స్‌తో అమలా అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ప్రాముఖ్యతతో ఆ ఫొటోలు క్షణాల్లోనే వైరల్‌గా మారాయి.

ఈ ఫోటోలు చూసి అభిమానులు ఆమె బోల్డ్ స్టైల్‌కు మంత్ర ముగ్ధులవుతున్నారు. గతంలో కూడా గ్లామర్ షో చేసినా, ప్రస్తుతం అమలా స్టైల్ మరింత ఆడ్వాన్స్ గా ఉండటంతో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం తన యాక్టింగ్ కెరీర్‌కు తాత్కాలిక విరామం ఇచ్చిన అమలా పాల్, పర్సనల్ లైఫ్‌ను కూడా బ్యాలెన్స్ చేస్తూ, సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో కనెక్ట్ అవుతూ ముందుకు సాగుతోంది.

ఇక మళ్ళీ ఆమె నటనలో కూడా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలని చూస్తోంది. ఒక వెబ్ సీరీస్ చేసేందుకు ఆ మధ్య చర్చలు జరుపుతున్నట్లు టాక్ వచ్చింది. కానీ ఆ విషయంలో పెద్దగా క్లారిటీ రాలేదు. ఇక తెలుగులో ఆమె నాయక్ (Naayak), ఇద్దరమ్మాయిలతో (Iddarammayilatho) , జెండాపై కపి రాజు, బెజవాడ (Bejawada) లాంటి సినిమాల్లో నటించింది.

 

View this post on Instagram

 

A post shared by Jagat Desai (@j_desaii)

బన్నీ.. ఆ కోలీవుడ్ కాంబో ఏమైనట్లు?

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.