March 15, 202509:36:40 AM

Anil Ravipudi: వెంకటేష్ సినిమా కోసం ఆ రెండు టైటిల్స్.. అనిల్ స్ట్రాటజీ బాగుంది

విక్టరీ వెంకటేష్  (Venkatesh) హీరో అనిల్ రావిపూడి (Anil Ravipudi)  దర్శకత్వంలో ‘ఎఫ్ 2’ (F2 Movie) , ‘ఎఫ్‌ 3’ (F3 Movie) వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత ఇంకో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ పై దిల్ రాజు (Dil Raju) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh) , మీనాక్షి చౌదరి  (Meenakshi Chaudhary)..లు హీరోయిన్లు. కామెడీ, యాక్షన్, ఫ్యామిలీ.. ఎలిమెంట్స్ తో ఈ సినిమా రూపొందుతుంది. ’90 శాతం షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యింది..

Anil Ravipudi

డబ్బింగ్ పనులు కూడా మొదలుపెట్టాం’ అని చిత్ర యూనిట్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా సంక్రాంతికి విడుదల అవుతుందా లేదా అనే విషయం పై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. కానీ వెంకటేష్ ట్వీట్లో మాత్రం సంక్రాంతికే వస్తున్నట్టు మెన్షన్ చేశారు. సరే ఆ విషయాలు పక్కన పెట్టేస్తే.. అనిల్ రావిపూడి కామెడీ విషయంలో ఎక్కువగా జంధ్యాల, ఈవీవీ సత్యనారాయణ స్టైల్ ని ఫాలో అవుతూ ఉంటారు.

అయితే ఈసారి టైటిల్ విషయంలో కూడా వాళ్లనే ఫాలో కాబోతున్నట్లు సమాచారం. అవును ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ (Intlo Illalu Vantintlo Priyuralu) వంటి టైటిల్స్ కి అప్పట్లో ఈవీవీ కేరాఫ్ అడ్రస్. ఇక వెంకీ- అనిల్ సినిమా కథ.. హీరో భార్య అలాగే అతని మాజీ ప్రియురాలు చుట్టూ తిరుగుతుంటుంది. అందుకోసమే ఈ సినిమాకి ‘ఇంట్లో ఇల్లాలు – పోలీస్ స్టేష‌న్ లో ప్రియురాలు’, ‘ఇక్క‌డ ఇల్లాలు.. అక్క‌డ ప్రియురాలు’ వంటి టైటిల్స్ రిజిస్టర్ చేయించారట. కథకి కరెక్ట్ గా సరిపోయే టైటిల్స్ అవి. కాకపోతే దేనిని ఫైనల్ చేస్తారో తెలియాల్సి ఉంది.

మైత్రీ ఫీట్‌ను రిపీట్‌ చేయనున్న దిల్‌ రాజు.. ఇద్దరూ ఒకేసారి వస్తారట!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.