March 25, 202510:50:25 AM

దేవర భామ.. ఈమె అందానికి కూడా ఫిదా అవ్వాల్సిందే!

సినిమాల్లో హీరోయిన్లు అందంగా, గ్లామరస్‌గా కనిపించడం మామూలే. కానీ, కొన్ని సందర్భాల్లో హీరోయిన్ల కంటే కూడా క్యారెక్టర్ ఆర్టిస్టులు మెరుస్తారు. ఇప్పుడు అలాంటి ఎగ్జాంపుల్‌గా నిలిచింది ‘దేవర’ (Devara) మూవీలో నటించిన శృతి మరాఠే. యంగ్ టైగర్ ఎన్టీఆర్  (Jr NTR)  హీరోగా కొరటాల శివ (Koratala Siva) డైరెక్ట్ చేసిన ఈ చిత్రం గ్రాండ్ సక్సెస్ సాధించింది. ఇందులో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేయగా, జాన్వీ కపూర్  (Janhvi Kapoor) , శృతి మరాఠే (Shruti Marathe) ఇద్దరు ఎన్టీఆర్ పాత్రలకు జోడిగా నటించారు.

Shruti Marathe

‘దేవర’ మూవీలో తండ్రి పాత్రలో ఎన్టీఆర్‌కు శృతి మరాఠే (Shruti Marathe) జోడీగా కనిపించింది. ఆ పాత్రలో ఆమె చీరకట్టులో కనిపించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది. జాన్వీ కపూర్ తన గ్లామర్‌తో స్క్రీన్‌ని మెరవగా, శృతి మరాఠే మాత్రం తన మన్నిచేసే హావభావాలు, పద్దతైన లుక్స్‌తో అందరినీ ఫిదా చేసింది. కొందరు జాన్వీ కంటే కూడా శృతి మరాఠేనే బాగా ఆకర్షించిందని అభిప్రాయపడుతున్నారు. శృతి మరాఠే గుజరాత్‌కి చెందిన నటి.

తన కెరీర్‌ను మరాఠీ సినిమాల ద్వారా మొదలు పెట్టిన ఆమె, తర్వాత హిందీ, కన్నడ, గుజరాతీ, తమిళ చిత్రాల్లో కూడా నటించింది. వివిధ భాషల్లో నటించిన ఈ భామ, సీరియళ్లలో కూడా తనదైన గుర్తింపు తెచ్చుకుంది. ప్రముఖ సీరియల్ నటుడు గౌరవ్ ఘట్నేకర్‌తో వివాహం చేసుకున్న శృతి ప్రస్తుతం సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. 38 ఏళ్ల శృతి మరాఠే  ఇప్పటికీ తన యాక్టింగ్ కెరీర్‌లో బిజీగానే ఉంది. అందంతో పాటు అద్భుతమైన నటనతో అన్ని భాషల్లోనూ అభిమానులను సంపాదించుకుంటోంది.

‘దేవర’లో ఆమె పాత్ర చిన్నదైనా, ఫుల్‌గా అట్ట్రాక్షన్‌గా నిలిచింది. ఈ పాన్ ఇండియా చిత్రం ద్వారా శృతి మరాఠే ఇప్పుడు దేశవ్యాప్తంగా పాపులర్ అవుతోంది. తన సోషల్ మీడియాలో రకరకాల ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ నెటిజన్లను ఎంటర్టైన్ చేస్తూ ఉంటోంది. ఇటీవలి కాలంలో ఆమె హాట్ అండ్ గ్లామరస్ లుక్స్ ట్రెండ్ అవుతున్నాయి. ఇంతవరకు రకరకాల భాషల్లో రాణించిన శృతి మరాఠే, ‘దేవర’ ద్వారా టాలీవుడ్ ప్రేక్షకుల గుండెల్లో కూడా స్థానం సంపాదించింది.

 

View this post on Instagram

 

A post shared by Shashank Sane (@saneshashank)

 

View this post on Instagram

 

A post shared by Shruti P Marathe (@shrumarathe)

చిక్కుల్లో పడ్డ గంగవ్వ.. కారణం అదే!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.