March 23, 202507:02:01 AM

మొన్న కల్కి – నేడు కంగువా.. బికినీ పాపకు మళ్ళీ దెబ్బె

బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని (Disha Patani) ‘కల్కి 2898ఏడీ’లో (Kalki 2898 AD) ఒక చిన్న పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీలో ఆమె పాత్రకు సంబంధించిన పోస్టర్స్ చూసి అభిమానులు ఆశలు పెట్టుకున్నా, సినిమా విడుదలైన తర్వాత పాత్ర నిడివి చూసి నిరాశ చెందారు. కేవలం 10 నిమిషాల వరకు మాత్రమే దిశా స్క్రీన్ పై కనిపించడం, ఆమె పాత్ర కేవలం ఒక సపోర్టింగ్ రోల్‌గానే ఉండడం అభిమానులను డిజపాయింట్ చేసింది. ఇప్పుడు అదే పరిస్థితి ‘కంగువా’ (Kanguva)  సినిమా విషయంలోనూ కనిపిస్తోంది.

Disha Patani

సూర్య (Suriya)  ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ భారీ పాన్ వరల్డ్ మూవీకి సంబంధించి దిశా పాత్రపై భారీ అంచనాలు ఉన్నాయి. కానీ టాక్ ప్రకారం, ఈ మూవీలో ఆధునిక కాలానికి సంబంధించిన కథ భాగం కేవలం 30 నిమిషాల వరకు మాత్రమే ఉంటుందని తెలుస్తోంది. దిశా పాత్ర కూడా ప్రెజెంట్ టైమ్ లైన్‌లో ఉండడంతో, ఆమె పాత్రకు పెద్దగా స్కోప్ ఉండకపోవచ్చని సినీ వర్గాలు చెబుతున్నాయి.

దీంతో ‘కంగువా’తో కూడా దిశా (Disha Patani) ఫ్యాన్స్ మరోసారి నిరాశకు గురయ్యే అవకాశముందని అంచనా వేస్తున్నారు. సౌత్‌లో దిశా పటానికి అవకాశాలు వచ్చినా, ఆమెకు గ్లామర్ షోకు మాత్రమే పరిమితం చేయడం అభిమానులను కూడా నిరుత్సాహపరుస్తోంది. ఆమె స్క్రీన్ టైమ్ తగ్గటమే కాకుండా, ప్రధాన పాత్రలుగా నిలిచే అవకాశాలు దొరకడం లేదని నిపుణులు అంటున్నారు.

అలాంటి పాత్రలు దిశా లాంటి గ్లామరస్‌ స్టార్‌లకు ఎక్కువ ఫోకస్ తెస్తాయని, సినిమాలకు అదనపు ఆకర్షణగా ఉంటాయని సినీ విశ్లేషకులు సూచిస్తున్నారు. అయితే, దిశా పటాని ఇంకా సౌత్‌లో మంచి పాత్రల కోసం ఎదురు చూస్తోంది. ‘కల్కి 2898ఏడీ పార్ట్ 2’లోనైనా, ‘కంగువా’ సీక్వెల్‌లోనైనా ఆమె పాత్రకు మంచి స్కోప్ వస్తుందేమో చూడాలి.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.