March 19, 202512:37:05 PM

ప్రభాస్, తారక్, బన్నీ, పవన్, చరణ్, మహేష్.. బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నారుగా!

టాలీవుడ్ (Tollywood) స్టార్స్ కు ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ పెరుగుతోంది. పాన్ ఇండియా స్థాయిలో టాలీవుడ్ స్టార్స్ అద్భుతాలు చేస్తున్నారు. యావరేజ్ టాక్ తో అద్భుతాలు సృష్టిస్తున్నారు. పుష్ప ది రైజ్ (Pushpa), భీమ్లా నాయక్ (Bheemla Nayak), దేవర (Devara) , సలార్ (Salaar), గుంటూరు కారం (Guntur Kaaram) సినిమాలకు రిలీజ్ రోజున మరీ అద్భుతం అనే రేంజ్ లో టాక్ రాలేదు. అయితే ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల విషయంలో అదరగొట్టాయి.

Tollywood

టాలీవుడ్ స్టార్స్ కు పాన్ ఇండియా క్రేజ్ కలెక్షన్ల విషయంలో ఎంతగానో ప్లస్ అవుతోంది. మాస్ సినిమాలకు యావరేజ్ టాక్ చాలని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. టాలీవుడ్ స్టార్స్ ఫ్యాన్స్ తో పాటు సినీ అభిమానులను మెప్పిస్తే బొమ్మ బ్లాక్ బస్టర్ అని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. టాలీవుడ్ స్టార్స్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నారని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరోల ప్రతి సినిమాకు యునానిమస్ పాజిటివ్ టాక్ రాకపోయినా మినిమం గ్యారంటీ అనే నమ్మకాన్ని కలిగిస్తే చాలని కామెంట్లు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ స్టార్స్ భవిష్యత్తు ప్రాజెక్టులు ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయని తెలుస్తోంది. టాలీవుడ్ స్టార్ హీరోలు ఇతర భాషల హీరోలతో కలిసి మల్టీస్టారర్ సినిమాలలో నటించడానికి సైతం ఇష్టపడుతున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోలు రెమ్యునరేషన్ల పరంగా కూడా టాప్ లో ఉన్నారు.

టాలీవుడ్ ఇండస్ట్రీలోని టైర్1 స్టార్ హీరోలందరూ తమ సినిమాలలో ప్రత్యేకతలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొత్త ప్రపంచంతో కూడిన కథలకు ప్రాధాన్యత ఇస్తున్న టాలీవుడ్ స్టార్ హీరోలు కథ నచ్చితే ఇతర భాషల డైరెక్టర్లకు సైతం ప్రాధాన్యత ఇస్తున్నారు. టాలీవుడ్ స్టార్స్ పాత్రలకు అనుగుణంగా లుక్స్ ను మార్చుకుంటున్నారు. ప్రభాస్ (Prabhas) , తారక్ (Jr NTR) , బన్నీ (Allu Arjun), పవన్ (Pawan Kalyan) , చరణ్ (Ram Charan), మహేష్ (Mahesh Babu) తమ సినిమాలతో బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నారని చెప్పవచ్చు.

అన్నీ అబద్ధాలే అంటూ ఫైర్ అయిన పూనమ్ కౌర్.. ఏం జరిగిందంటే?

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.