March 20, 202502:00:19 AM

Dil Raju: ‘బలగం’ విజయం వెనుక సింగర్‌ సునీత్‌.. ఏం జరిగిందో చెప్పిన దిల్‌ రాజు.!

సినిమా పరాజయం వెనుక, విజయం వెనుక చాలా మంది కృషి ఉంటుంది. పరాజయం వెనుక ఉండే వాళ్ల పేర్లు బయటకు రావు. ఒకరో ఇద్దరో పేర్లు చెబుతారు అంటే. అయితే విజయం వెనుక ఉన్న వాళ్లు ఎప్పటికైనా గొప్పే. ఎందుకంటే విజయానికి ఉన్న గౌరవం అలాంటిది. తాజాగా గొప్ప గౌరవం అందుకున్న ఓ చిన్న సినిమా వెనుక ఉన్నదెవరో తెలిసింది. దీంతో ఆమెలో ఈ టాలెంట్‌ కూడా ఉందా అంటూ ఆశ్చర్యపోతున్నారు.

Dil Raju

ఆమెనే సింగర్‌ సునీత (Sunitha) , ఆ సినిమానే ‘బలగం’ (Balagam) . దిల్ రాజు (Dil Raju) నిర్మాణంలో వేణు యెల్దండి (Venu Yeldandi) తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రియదర్శి (Priyadarshi Pulikonda), కావ్య కల్యాణ్‌రామ్‌ (Kavya Kalyanram) నటించి మెప్పించారు. సినిమా ఎంత పెద్ద విజయం అందుకుందో, అంతే పెద్ద అవార్డులు కూడా సంపాదించుకుంది. అయితే ఈ సినిమా విషయంలో సింగర్‌ సునీత చేసిన కొన్ని సూచనలు, ఇచ్చిన ధైర్యం చాలా ఉపయోగపడ్డాయని నిర్మాత దిల్‌ రాజు ఇటీవల చెప్పుకొచ్చారు.

‘బలగం’ సినిమాను విడుదలకు ముందు మ్యాంగో రామ్ – సునీత దంపతులకు దిల్‌ రాజు చూపించారట. సినిమా ఎడిట్‌ రూమ్‌లో చూసినాక ద్వితీయార్ధంలో కొన్ని సన్నివేశాలు, ప్లాట్స్‌కు సునీత కొన్ని సూచనలు చేశారు. దీంతో సినిమా టీమ్‌ మరోసారి ఎడిట్‌ టేబుల్‌ మీద కూర్చుని సెకండాఫ్‌ను షార్ప్‌ చేశారట. అలా చేయడం వల్ల సినిమాకు ఎంతో లాభం చేకూరింది అని దిల్‌ రాజు తెలిపారు.

అలాగే ‘బలగం’ సినిమా తెలంగాణకు పరిమితమైపోయిందా అనే డౌట్‌ కూడా విడుదలకు ముందు దిల్‌ రాజు అండ్‌ టీమ్‌కి అనిపించిందట. కొంతమంది ఆ దిశగా విమర్శలు చేయడమే కారణమట. అయితే సినిమా చూసిన తర్వాత సునీత ఇది తెలంగాణ సినిమా మాత్రమే కాదని, తెలుగువాడి సినిమా అని అన్నారట. అలాగే ఈ సినిమా అందరికీ ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతుందని కూడా చెప్పారట. ఆ నమ్మకంతోనే ముందుకొచ్చాం.. విజయం సాధించాం అని దిల్‌ రాజు తెలిపారు.

థమన్ ట్వీట్ తో టెన్షన్ లో చరణ్ ఫ్యాన్స్.. ఇలా చేయడం రైటేనా?

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.