March 17, 202501:33:00 AM

Game Changer: రాంచరణ్ ఫ్యాన్స్ కి కూడా నిరాశ తప్పదా!

గ్లోబల్ స్టార్ రాంచరణ్ (Ram Charan)   హీరోగా తెరకెక్కుతున్న ‘గేమ్ ఛేంజర్’ (Game Changer)  పై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కాబోతుంది ఈ సినిమా. మొదటి నుండి ఈ సినిమాకి సంబంధి అప్డేట్స్ సరిగ్గా రాకపోవడంతో ఫ్యాన్స్ చాలా డిజప్పాయింట్ అయ్యారు. అదే క్రమంలో అప్డేట్స్ కంటే ఎక్కువగా రూమర్స్ రావడం కూడా వారి సహనానికి పరీక్షగా మారింది అని చెప్పొచ్చు. ఇక ‘గేమ్ ఛేంజర్’ టీజర్ ని దీపావళి కానుకగా అక్టోబర్ 31 న విడుదల చేస్తున్నట్టు ప్రకటన వచ్చింది.

Game Changer

కానీ అందులో నిజం లేదు అనేది ఇన్సైడ్ టాక్. ఈ దీపావళికి ఎటువంటి టీజర్ రావడం లేదట. కానీ 4 రకాల టీజర్ కట్లు రెడీ అయ్యాయట. అందుతున్న సమాచారం ప్రకారం నవంబర్ 4 న ‘గేమ్ ఛేంజర్’ టీజర్ ను లాంచ్ చేయాలని శంకర్ (Shankar)  అండ్ టీం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఒక ఈవెంట్ ను ఏర్పాటు చేసి అందులో భాగంగా ‘గేమ్ ఛేంజర్’ టీజర్ ను లాంచ్ చేయబోతున్నారట. దానికి సంబంధించిన అనౌన్స్మెంట్ మాత్రమే..

అక్టోబర్ 31 న ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. సో దీపావళికి ‘గేమ్ ఛేంజర్’ టీజర్ లేదు. ఇక ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే 2 పాటలు బయటకు వచ్చాయి. మొదట వాటికి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ.. యూట్యూబ్లో బాగానే వైరల్ అయ్యాయి అని చెప్పాలి. ఇక ఈ చిత్రంలో రాంచరణ్ రెండు రకాల షేడ్స్ కలిగిన పాత్రల్లో కనిపించబోతున్నాడు. ఒకటి తండ్రి పాత్ర ఇంకోటి కొడుకు పాత్ర. ఎస్.జె.సూర్య, జయరాం, సునీల్, అంజలి వంటి స్టార్ క్యాస్ట్ ఇందులో ఉంది.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.