March 21, 202512:17:36 AM

Balakrishna: నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చేశాడు..కిక్కు రాదంటూ..?

‘అఖండ ‘ (Akhanda) ‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy)  ‘భగవంత్ కేసరి’ (Bhagavath Kesari)  వంటి సూపర్ హిట్లతో ఫామ్లో ఉన్న బాలకృష్ణ..తదుపరి చిత్రాన్ని ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) దర్శకుడు బాబీతో (Bobby)  చేస్తున్న సంగతి తెలిసిందే. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ (Suryadevara Naga Vamsi) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇప్పటికే 80 శాతం షూటింగ్ కంప్లీట్ అయ్యింది. కీలక షెడ్యూల్ బ్యాలెన్స్ ఉంది. దాని కోసం ఇంకో హీరో కావాలట. ఆ విషయాలు అలా ఉంచితే.. సంక్రాంతికి ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు.

Balakrishna

కానీ ఇంకా ఈ సినిమా టైటిల్ ఏంటి అనేది ప్రకటించలేదు. దీపావళి కానుకగా టైటిల్ ను ఓ మోషన్ పోస్టర్ ను విడుదల చేస్తామని మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. కానీ అది సాధ్యమయ్యేలా లేదు అని చెప్పి పెద్ద షాక్ ఇచ్చాడు నాగవంశీ. ‘లక్కీ భాస్కర్’ (Lucky Baskhar)  ప్రమోషన్స్ లో భాగంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాగవంశీ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

‘దీపావళి కానుకగా బాలకృష్ణ (Nandamuri Balakrishna) గారి సినిమా టైటిల్ ను, మోషన్ పోస్టర్ తో విడుదల చేయాలని అనుకున్నాం. టైటిల్ ఫిక్స్ అయ్యింది..కానీ మోషన్ పోస్టర్ కి అవసరమైన వి.ఎఫ్.ఎక్స్ వర్క్ మాత్రం పెండింగ్ ఉంది. సో ఈ దీపావళికి ఎటువంటి అప్డేట్ లేదు. ఇందుకు గాను బాలకృష్ణగారి ఫ్యాన్స్ కి నేను క్షమాపణలు తెలుపుకుంటున్నాను. నవంబర్ 2వ వారంలో తప్పకుండా అప్డేట్ ఇస్తాం.

సంక్రాంతి కనుకగానే ఈ సినిమా విడుదల చేస్తాం” అంటూ నాగవంశీ చెప్పుకొచ్చారు. ఇక బాలకృష్ణ కెరీర్లో 109వ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రానికి ‘డాకూ మ‌హారాజా’ అనే టైటిల్ అనుకుంటున్నట్టు టాక్ నడుస్తుంది. ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.

వార్ 2: RRR కంటే హై రేంజ్ కిక్!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.