March 21, 202512:44:49 PM

Maa Nanna Superhero Collections: ‘మా నాన్న సూపర్ హీరో’ … మొదటి వారం కలెక్షన్స్ ఏంటంటే..!

సుధీర్ బాబు  (Sudheer Babu)  హీరోగా రూపొందిన ‘మా నాన్న సూపర్ హీరో’ (Maa Nanna Superhero)  చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘వి సెల్యులాయిడ్స్’ ‘కామ్ ఎంటర్టైన్మెంట్’..సంస్థల పై సునీల్ బలుసు నిర్మించిన ఈ చిత్రంలో షాయాజీ షిండే (Sayaji Shinde), సాయి చంద్ (Sai Chand)  ..లు ముఖ్య పాత్రలు పోషించారు.మొదటి రోజు ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది..కానీ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా టాక్ కి తగినట్టు కలెక్ట్ చేయలేదు.దసరా సెలవులను ఎంతమాత్రం క్యాష్ చేసుకోలేకపోయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది.

Maa Nanna Superhero Collections:

ఒకసారి ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ని గమనిస్తే:

నైజాం 0.35 cr
సీడెడ్ 0.10 cr
ఉత్తరాంధ్ర 0.19 cr
ఈస్ట్ 0.08 cr
వెస్ట్ 0.05 cr
గుంటూరు 0.11 cr
కృష్ణా 0.16 cr
నెల్లూరు 0.04 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 1.08 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.09 cr
వరల్డ్ వైడ్ టోటల్ 1.17 cr

‘మా నాన్న సూపర్ హీరో’ చిత్రానికి రూ.4.9 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.5.2 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి వారం పూర్తయ్యేసరికి ఈ సినిమా కేవలం రూ.1.17 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి ఇంకో రూ.4.03 కోట్ల షేర్ ను రాబట్టాలి.

‘దేవర’ 3 వారాల కలెక్షన్స్.. ప్రాఫిట్ ఎంత?

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.