March 20, 202511:57:11 PM

Naga Chaitanya: ఖాళీ అయిన క్రిస్మస్‌.. ఆ హీరో క్లారిటీ మీదే అందరి చూపు.. ఏం చెబుతాడో?

చెడులో కూడా మంచిని వెతుక్కోమంటారు పెద్దలు. అంటే ఏదైనా నెగిటివ్‌గా జరిగితే అందులో ఓ పాజిటివ్‌ అంశాలను వెతుక్కోవాలి. అలా ఇప్పుడు జరిగిన ఓ సినిమా వాయిదా.. మరో సినిమాకు లైన్‌ క్లియర్‌ చేస్తోందా? ఏమో దిల్‌ రాజు స్టెప్‌ను అల్లు అరవింద్‌ పాజిటివ్‌గా తీసుకుంటే అదే జరుగుతుంది. అల్లు అరవింద్‌ పేరు చెప్పాం కాబట్టి.. ఆ సినిమా ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుంది. శంకర్‌ (Shankar) – దిల్‌ రాజు (Dil Raju)  పుణ్యమా అని ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer)  సినిమా క్రిస్మస్‌ నుండి సంక్రాంతికి వెళ్లిపోయింది.

Naga Chaitanya

దీంతో డిసెంబరులో వచ్చే పెద్ద సినిమా ‘పుష్ప: ది రూల్‌’(Pushpa 2)   ఒక్కటే. ఆ సినిమా కూడా తొలి వారంలోనే వస్తుంది. కాబట్టి మూడు, నాలుగు వారాల్లో సినిమాకు ఛాన్స్‌ ఉంది. దీనికి ‘తండేల్‌’ (Thandel) సినిమా క్యాష్ చేసుకోవాలి అని ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. మంచి డేట్‌ ఖాళీగా ఉంది అంటూ సూచిస్తున్నారు. నాగచైతన్య (Naga Chaitanya) కెరీర్‌లో భారీ బడ్జెట్‌, అతి పెద్ద కాన్వాస్‌ ఉన్న సినిమాగా ‘తండేల్‌’ను తీర్చిదిద్దుతున్నరు చందు మొండేటి.

జీఏ 2 బ్యానర్‌లో రూపొందుతున్న ఈ సినిమాలో చైతు – సాయిపల్లవి (Sai Pallavi) నటిస్తున్నారు. ఈ సినిమాను నిజానికి డిసెంబరులో విడుదల చేస్తామని టీమ్‌ చెప్పింది. అయితే వివిధ వాయిదాల తర్వాత ‘పుష్ప: ది రూల్‌’ డిసెంబరు మొదటి వారానికి రావడంతో ‘తండేల్‌’ విషయం తేలడం లేదు. అటా, ఇటా అనే మాట కూడా చెప్పడం లేదు. ఇప్పుడు ‘గేమ్‌ ఛేంజర్‌’ రాక వాయిదా పడటంతో అల్లు అరవింద్‌ ఏమన్నా ప్లాన్‌ చేస్తారేమో చూడాలి.

మరోవైపు డిసెంబరు మూడో వారం అక్కినేని నాగార్జునకు (Nagarjuna) సెంటిమెంట్‌. గతంలో ఆ టైమ్‌లో వచ్చిన సినిమాలు ఆయనకు మంచి విజయం అందించాయి కూడా. ఈ లెక్కన చైతన్య కూడా డిసెంబరు మూడో వారంలో వస్తాడేమో చూడాలి. ఎందుకంటే అప్పుడు వస్తే జనవరి రెండో వారం వరకు ఆ సినిమాకు థియేటర్లలో ఆడించే ఛాన్స్‌ ఉంటుంది కాబట్టి.

పర్సనల్‌ వీడియో లీక్‌.. ఫుల్‌ వీడియో నెక్స్ట్‌ అని చెప్పిన చెప్పిన హీరోయిన్‌..!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.