March 16, 202501:29:04 PM

Nayanthara: ప్లాస్టిక్ సర్జరీ వార్తలు అందుకే మొదలయ్యాయి : నయనతార!

సౌత్ లో లేడీ సూపర్ స్టార్ గా చలామణి అవుతున్న నయనతార (Nayanthara)  గురించి నిత్యం ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. ఆమెకు పెళ్లయ్యేవరకు ఆమె భర్త విగ్నేష్ శివన్ తో (Vignesh Shivan)  డేటింగ్ వ్యవహారాలు.. ‘అక్కడికి వెళ్లారు ఇక్కడికి వెళ్లారు’ అంటూ ప్రచారంలో ఉండేది. అలాగే పెళ్లయ్యాక సరోగసి పద్దతిలో పిల్లల్ని కన్నది అంటూ రకరకాలుగా ఆమెను విమర్శించారు. ఇలాంటి వార్తలు అన్నీ దేశవ్యాప్తంగా ఓ ఊపు ఊపినవే..! ఇదిలా ఉండగా..

Nayanthara

నయన్ పిక్స్ అవి సోషల్ మీడియాలో ఎక్కువగానే హాట్ టాపిక్ అవుతుంటాయి. అలా కొన్నాళ్లుగా నయన్ పిక్స్ చూసిన కొంతమంది నెటిజన్లు.. ‘గతంలో ఆమె లుక్స్ వేరుగా ఉన్నాయని, సో నయన్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందని’ అభిప్రాయ పడ్డారు. వాటికి నయనతార స్పందించి క్లారిటీ ఇచ్చింది. ఇటీవల ఓ ఈవెంట్లో భాగంగా నయన్ మాట్లాడుతూ.. ” నేను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాను అంటూ చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. అందులో ఎంత మాత్రం నిజం లేదు.

నేను ఎటువంటి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోలేదు. కానీ నా ‘ఐ బ్రోస్’ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటూ ఉంటాను. కొన్నేళ్లుగా నా ఐ బ్రోస్ విషయంలో చాలా మార్పులు వచ్చాయి. వాటి వల్లే ‘నేను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాను అనే కామెంట్లు మొదలయ్యాయి’ అంటూ నయన్ క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం నయన్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక సినిమాల విషయానికి వస్తే … నయన్ ప్రస్తుతం ‘డియర్ స్టూడెంట్స్’ ‘తని ఒరువన్ 2’ వంటి సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది.

విజయ్ పొలిటికల్ ఎంట్రీ పై పవన్ కళ్యాణ్ ట్వీట్!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.