March 19, 202501:47:03 PM

Pawan Kalyan: అకీరాకి ఒక్క టైటిల్ అయినా మిగులుతుందా.. లేదా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) .. ఈ పేరు చెబితే చాలు అందరూ అలర్ట్ అవుతారు. సినిమాల పరంగా చూసుకున్నా, రాజకీయాల పరంగా చూసుకున్నా.. పవన్ ఓ ‘గేమ్ ఛేంజర్’ అనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ రాకముందు వరకు హీరోయిజం ఒకలా ఉండేది. పవన్ కళ్యాణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చాక హీరోయిజం ఇంకోలా మారింది. అప్పటివరకు హీరో అంటే ఫైట్లు,విలన్ కి వార్నింగ్లు, హీరోయిన్ తో డాన్సులు అన్నట్టే ఉండేది. కానీ సహజంగా నటించి ప్రేక్షకుల్ని మెప్పించే వాళ్ళే నిజమైన హీరోలు అని ‘తొలిప్రేమ’ (Tholi Prema) ‘తమ్ముడు’ (Thammudu) వంటి సినిమాలతో నిరూపించారు పవన్ కళ్యాణ్.

Pawan Kalyan

‘బద్రి’ కి (Badri) ముందు వరకు.. ఒక్క మాస్ సినిమా చేయకుండా స్టార్ డం సంపాదించుకున్న హీరో టాలీవుడ్లో ఉన్నారా అంటే.. దానికి సమాధానంగా పవన్ కళ్యాణ్ పేరు వినిపించేది. ఇలా చెప్పుకుంటూ పోతే..చాలానే ఉంటుంది. ప్రస్తుతం పవన్ సినిమాలు తగ్గించి డిప్యూటీ సీఎంగా రాజకీయాల్లో బిజీగా గడుపుతున్నారు. ఇదిలా ఉండగా.. పవన్ కళ్యాణ్ రిఫరెన్స్..లు వాడుకోవడం టాలీవుడ్లో కొంతమందికి బాగా అలవాటు. ఇప్పుడైతే ఆయన టైటిల్స్ పై యంగ్ హీరోలు మనసు పడుతున్నట్టు స్పష్టమవుతుంది.

పవన్ రిఫరెన్స్..లు కచ్చితంగా వాడుకునే హీరోగా నితిన్ ని (Nithin Kumar) చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అతను ‘తమ్ముడు’ (Thammudu) అనే సినిమాలో నటిస్తున్నాడు. వకీల్ సాబ్ (Vakeel Saab) దర్శకుడు వేణు శ్రీరామ్ (Venu Sriram) డైరెక్ట్ చేస్తున్న మూవీ ఇది. ‘తమ్ముడు’ అనేది పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ సినిమా టైటిల్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు! అలాగే స్టార్ యాంకర్ ప్రదీప్ (Pradeep Machiraju) హీరోగా నితిన్ – భ‌ర‌త్ ..ల దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. దీనికి ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారట.

‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ (Akkada Ammayi Ikkada Abbayi) అనేది పవన్ కళ్యాణ్ డెబ్యూ మూవీ టైటిల్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీటికి ముందు వరుణ్ తేజ్ (Varun Tej) ‘తొలిప్రేమ’ (Tholi Prema) టైటిల్ వాడుకున్నాడు. అలాగే విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ‘ఖుషి’ (Kushi) టైటిల్ తో సినిమా చేశాడు.ఇంకా టాలీవుడ్లో కొంతమంది హీరోలు పవన్ పాత సినిమాల టైటిల్స్ పై మోజు పడుతున్నట్లు సమాచారం. చూస్తుంటే అకీరా హీరోగా ఎంట్రీ ఇచ్చాక.. వాడుకోవడానికి సినిమా టైటిల్స్ ఏమీ మిగలవేమో..!

 ‘బాహుబలి 3’పై నిర్మాత ఆసక్తికర కామెంట్స్‌.. ఏమన్నారంటే?

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.