March 25, 202510:14:33 AM

Prabhas: ప్రశాంత్ వర్మకు ప్రభాస్ దొరకాలంటే అంత ఈజీ కాదు!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో అత్యధిక మార్కెట్ ఉన్న హీరోగా దూసుకుపోతున్నాడు. ఇక ప్రభాస్ అప్పుడప్పుడు కాస్త లిమిటెడ్ బడ్జెట్ లో సినిమాలు చేయాలని అనుకుంటున్నా నిర్మాతలు మాత్రం వందల కోట్ల బడ్జెట్ పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. దర్శకులు కూడా ప్రభాస్‌ను హీరోగా పెట్టుకుని చిన్న సినిమా చేయాలనే ఆలోచనకు అస్సలు రావడం లేదు. పాన్ ఇండియా స్థాయికి తగ్గ ప్రాజెక్ట్‌లను రూపొందించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

Prabhas

అయితే ప్రస్తుత లైన్ అప్ ప్రకారం చూస్తే ప్రభాస్ కొత్త దర్శకులతో సినిమాలు చేయడం అనేది ఇంకో మూడేళ్ల వరకు సాధ్యం కాని పని అని తెలుస్తోంది. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ప్రశాంత్ వర్మ (Prasanth Varma) కూడా ప్రభాస్ కోసం ఒక స్టోరీ ప్రిపేర్ చేసి నేరేట్ చేశాడట. ఈ కథ పై చర్చలు జరుగుతున్నప్పటికీ, ప్రభాస్ లైనప్ క్లియర్ అవ్వడానికి ఇంకో 3-4 సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. అప్పటి వరకు ప్రశాంత్ వర్మ కూడా తన ప్రస్తుత ప్రాజెక్ట్స్‌ ‘జై హనుమాన్’, మోక్షజ్ఞ డెబ్యూ సినిమాలను పూర్తి చేయాల్సి ఉంటుంది.

అయితే ప్రశాంత్ వర్మ తన సూపర్ హీరో ప్రాజెక్ట్స్ కోసం ముందుగా హీరోలను కన్ఫర్మ్ చేసుకునే పనిలో ఉన్నట్లు ఇండస్ట్రీలో టాక్. ప్రభాస్‌తో పనిచేయడానికి అనుకుంటే ఆయన లైన్ అప్ ముగిసేవరకు వేచి చూడాల్సిందే. ప్రస్తుతం ప్రభాస్ మారుతి (Maruthi Dasari) దర్శకత్వంలో ‘ది రాజాసాబ్’ (The Raja Saab) పూర్తిచేసే పనిలో ఉన్నారు. అలాగే ‘ఫౌజీ’ షూటింగ్ కూడా దశల వారీగా జరుగుతోంది.

ఇంకా సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) డైరెక్ట్ చేస్తున్న ‘స్పిరిట్’ (Spirit) , ‘కల్కి 2898ఏడీ పార్ట్ 2’ (Kalki 2898 AD) , ‘సలార్ 2’ వంటి ప్రాజెక్ట్‌లు కూడా లైన్లో ఉన్నాయి. అందువల్ల, ఈ ప్రాజెక్ట్‌లన్నీ పూర్తయిన తర్వాతే ప్రశాంత్ వర్మతో కలిసి సినిమా చేసే అవకాశం ఉంటుంది. కానీ, ప్రశాంత్ వర్మ తన లైనప్ లో ఉన్న ప్రాజెక్ట్‌లను పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగా హ్యాండిల్ చేయాలి, మరో మూడు సంవత్సరాల్లో మరిన్ని బిగ్ హిట్స్ సాధిస్తే ప్రభాస్ తో ఈజీగా ఛాన్స్ రావచ్చు.

అఖండ 2: బోయపాటి మళ్ళీ అదే తప్పు చేయారుగా..?

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.