March 26, 202508:09:00 AM

Pushpa 2: పుష్ప 2: టోటల్ గా ఎన్ని థియేటర్లంటే..!

సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమాల్లో ‘పుష్ప ది రూల్’ (పుష్ప 2) (Pushpa 2) ఒకటి. అల్లు అర్జున్ (Allu Arjun)  , సుకుమార్ (Sukumar) కలయికలో రూపొందిన ఈ సినిమా, గతంలో సంచలన విజయం సాధించిన ‘పుష్ప ది రైజ్’కి సీక్వెల్‌గా వస్తోంది. దీంతో ఈ సినిమాపై అంచనాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో వచ్చిన ఈ క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకొని, యూనిట్ ముందుగా ప్లాన్ చేయని రీతిలో భారీ స్థాయిలో థియేటర్లను సిద్ధం చేస్తోంది.

Pushpa 2

గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంతో రూపొందిన ఈ మాస్ ఎంటర్‌టైనర్‌కు సంబంధించి ఇప్పటి వరకూ షూటింగ్‌ దాదాపు పూర్తి కాగా, పోస్ట్ ప్రొడక్షన్ కూడా వేగంగా జరుగుతోంది. చిత్రాన్ని విడుదలకు ముందే బిజినెస్ పరంగా రికార్డు స్థాయిలో ఒప్పందాలు చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే తాజా సమాచారం ప్రకారం, ‘పుష్ప ది రూల్’ను ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 11500 థియేటర్లలో విడుదల చేయాలని చిత్ర బృందం లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ విడుదల ప్లాన్‌లో 11500 థియేటర్లలో సినిమా ప్రదర్శితం కానుందని తెలిసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. అదే జరిగితే, టాలీవుడ్‌లో ఈ సినిమా ఆల్‌టైం రికార్డు బ్రేక్ చేయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. గతంలో ‘RRR‘ చిత్రం 10200 థియేటర్లలో విడుదల చేయబడగా, ఇప్పుడు ‘పుష్ప 2’ మరింత పెద్ద సంఖ్యలో థియేటర్లలో ప్రదర్శించబడనుంది. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా భారీ స్థాయిలో విడుదల కావడమే కాకుండా, ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులు షేక్ చేయనుందని ఆశిస్తున్నారు.

దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad)  సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్నా (Rashmika Mandanna), ఫహాద్ ఫాజిల్ ( Fahadh Faasil), సునీల్ (Sunil) , అనసూయ (Anasuya Bhardhwaj), జగదీష్ (Jagadesh), అజయ్ (Ajay) కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘పుష్ప ది రూల్’ భారీ విడుదలతోనే కాకుండా అన్ని రకాల ప్రమోషన్లలోనూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచేందుకు సుకుమార్ టీమ్ సన్నాహాలు చేస్తోంది. మరి సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఓపెనింగ్స్ అందుకుంటుందో చూడాలి.

నవీన్ పోలిశెట్టి సినిమాపై క్లారిటీ ఇచ్చిన నాగవంశీ !

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.