March 21, 202503:16:50 AM

Rajinikanth, Mani Ratnam: ‘వేట్టయన్‌’ ఎఫెక్టా? మణిర్నతం సినిమా నిజంగానే అనుకోలేదా?

‘కూలీ’ (Coolie) సినిమా తర్వాత రజనీకాంత్‌ (Rajinikanth) సినిమా ఇదే అంటూ.. గత కొన్ని రోజులుగా ఓ వార్త సోషల్‌ మీడియాలో, కోడంబాక్కం వర్గాల్లో హల్‌ చల్‌ చేసింది. 33 ఏళ్ల తర్వాత కలుస్తున్నారు, రూ. 200 కోట్ల బడ్జెట్.. అంటూ ఆ ప్రాజెక్ట్‌కు కూడా హైప్‌ ఇచ్చారు. కట్‌ చేస్తే ఇప్పుడు అసలు అలాంటి ఆలోచనే చేయలేదని, ఆ డిస్కషనే జరగలేదని ఆ దర్శకుడి భార్య చెబుచుతున్నారు. దీంతో తలైవా ఫ్యాన్స్‌ అవాక్కయ్యారు.

Rajinikanth, Mani Ratnam:

రజనీకాంత్ – మణి రత్నం (Mani Ratnam) సినిమాపైనే గత కొన్ని రోజులుగా పైన చెప్పిన వార్తలు వస్తున్నాయి. అంత గ్యాప్‌ తర్వాత వస్తుండటమే అంత హైప్‌కి కారణమమైంది. కానీ అవన్నీ నిజం కాదని నటి, మణిరత్నం భార్య సుహాసిని స్పష్టం చేశారు. మణిరత్నం – రజనీకాంత్‌ కాంబోలో సినిమా కేవలం ప్రచారం మాత్రమేనని ఆమె తేల్చేశారు. ఇద్దరి మధ్య సినిమాకు సంబంధించి ఎలాంటి చర్చ జరగలేదని క్లారిటీ ఇచ్చారు.

కాంబినేషన్‌లో సినిమా అనే విషయం బహుశా రజనీకాంత్‌కు కూడా తెలిసి ఉండకపోవచ్చని ఆమె అన్నారు. ఇక మణిరత్నానికి అయితే అస్సలు తెలియదని నవ్వేశారామె. దీంతో నిజంగానే సినిమా చర్చలు జరగలేదా? లేక ‘వేట్టయన్‌’ ఫలితం నేపథ్యంలో ఏమైనా మార్పులు జరిగాయా అనే చర్చ మొదలైంది. అయితే ఒక సినిమా ఫలితంతో మరో సినిమా ఆగిపోవడానికి తలైవా ఏమన్నా కుర్ర హీరోనా చెప్పండి.

అయితే అసలు ఈ సినిమా పుకారు ఎందుకొచ్చింది అనేది తెలియాల్సి ఉంది. ఇక ప్రస్తుతం మణిరత్నం – కమల్ హాసన్ ప్రస్తుతం ‘థగ్‌ లైఫ్’ అనే సినిమా చేస్తున్నారు. దశాబ్దాల తర్వాత వీళ్లిద్దరి కలయికలో వస్తున్న సినిమా ఇది. ఈ క్రమంలోనే మణిరత్నం – రజనీ కాంబో కూడా ఓకే అయింది అనే ఊహ ఏమన్నా పుకారుగా మారి వార్త అయిందా అనేది చూడాలి. ఇక రజనీ అయితే లోకేశ్ కనగరాజ్‌తో ‘కూలి’ అనే సినిమా చేస్తున్నారు. ఇటీవల కొత్త షెడ్యూల్‌ ప్రారంభించుకుంది సినిమా టీమ్‌.

OG: ఫ్యాన్స్ కు ఇది బ్యాడ్ న్యూసే..

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.