March 24, 202508:50:23 AM

Ram Charan: ఫేవరెట్ కారు కోసం సెంటిమెంట్ నెంబర్ తీసుకున్న చరణ్!

రామ్ చరణ్ (Ram Charan) నిన్న హైదరాబాద్ లోని ఆర్టీవో ఆఫీస్ కి వెళ్లి తన కొత్త రోల్స్ రాయిస్ కారును రిజిష్టర్ చేసుకున్న విషయం తెలిసిందే. ఆర్టీవో ఆఫీస్ కి వచ్చిన చరణ్ లుక్స్ సోషల్ మీడియా మొత్తం వైరల్ అయిపోయాయి. “రంగస్థలం” (Rangasthalam) లుక్స్ ను తలపించేలా ఉన్న చరణ్ కొత్త లుక్స్ అదిరిపోయాయని ఫ్యాన్స్ అందరూ ఖుష్ అయిపోయారు. ఇప్పటివరకు చరణ్ తాను కొనుక్కున్న ప్రతి కారుకి 2727 నెంబర్ నే రిజిష్టర్ చేసుకుంటూ వచ్చాడు.

Ram Charan

ఇప్పుడు రోల్స్ రాయిస్ స్పెక్టర్ కారుకు కూడా 2727 అనే నెంబర్ ని తీసుకున్నాడు. “TG09 2727” అనే నెంబర్ ను రామ్ చరణ్ కొత్త కారు కోసం తీసుకున్నాడు. ఈ నెంబర్ కోసం ఆక్షన్ కూడా జరిగిందని, ఫ్యాన్సీ నెంబర్ కావడంతో ఫ్యాన్సీ రేటుకే ఈ నెంబర్ ను చరణ్ దక్కించుకున్నాడని తెలుస్తోంది. కొణిదెల కుటుంబంలో ఇది రెండో రోల్స్ రాయిస్ కారు కావడం విశేషం.

అది కూడా చరణ్ తన తండ్రి చిరంజీవి (Chiranjeevi) కోసం గిఫ్ట్ గా ఇచ్చినదే. అది ఫాంటమ్ మోడల్ కారు కాదా, ఇప్పుడు చరణ్ కొనుక్కున్న స్పెక్టర్ మోడల్ కారు మరింత ఆధునీకరణమైనది కావడం గమనార్హం. చిరంజీవి రోల్స్ రాయిస్ కారుకు కూడా గత ఏడాది దాదాపు 5 లక్షలు వెచ్చించి మరీ “TS09 GB 1111” నెంబర్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.

సెలబ్రిటీలు ఇలా కారుకి స్పెషల్ నెంబర్ కోసం డబ్బులు పెట్టడం అనేది కొత్తేమీ కాదు. జూనియర్ ఎన్టీఆర్  (Jr NTR)  తన లంబోర్గిని ఉరుస్ కారు కోసం ఏకంగా 17 లక్షలు చెల్లించడం చిన్నపాటి సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ కారు నెంబర్ “TS09 FS 9999”. ఎన్టీఆర్ ఈ 9999 నెంబర్ ను తన ప్రతి కారు విషయంలో ఫాలో అవుతాడు. ఎన్టీఆర్ ట్విట్టర్ ఎకౌంట్ కూడా tarak9999 కావడం విశేషం.

కమిటీ కుర్రాళ్లు, ఆయ్ కోవలో పొట్టేల్ చేరుతుందా?

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.