April 11, 202502:01:10 PM

RC16: మరో పెద్ద హీరోయిన్ కూడానా..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)  ప్రస్తుతం తన 16వ (RC16) సినిమా షూటింగ్‌కి సిద్దమవుతున్న విషయం తెలిసిందే. ‘ఆర్ఆర్ఆర్’ (RRR) వంటి ఘన విజయం తర్వాత చరణ్ క్రేజ్ గ్లోబల్ రేంజ్‌కు చేరింది. ఇప్పుడు ‘గేమ్ చేంజర్’ (Game changer) చిత్రం ద్వారా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. సంక్రాంతి సందర్భంగా విడుదల కానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే, రామ్ చరణ్ తన తదుపరి చిత్రాన్ని బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) డైరెక్షన్‌లో చేయబోతున్నారు.

RC16

‘ఉప్పెన’ (Uppena) సినిమాతో దర్శకుడిగా తన ప్రతిభను నిరూపించుకున్న బుచ్చిబాబు, రామ్ చరణ్‌తో ఈ కొత్త సినిమా ద్వారా మరోసారి హిట్ అందుకోవాలని చూస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా ఇటీవలే పూర్తయ్యాయి. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఈ చిత్రం స్పోర్ట్స్ నేపథ్యంతో రూపొందుతుందని ఇప్పటికే సమాచారం రాగా, ఇందులో రామ్ చరణ్ ఓ అథ్లెట్‌గా కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ కోసం రామ్ చరణ్ లుక్ కూడా డిఫరెంట్‌గా ఉండబోతుందని ప్రచారం జరుగుతోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో మరిన్ని ప్రత్యేకతలు ఉండనున్నాయి. ఇప్పటికే చరణ్ కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ని  (Janhvi Kapoor) ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఫిలిం నగర్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం, ఈ సినిమాలో మరో అగ్ర నటి సమంత (Samantha) రూత్ ప్రభు కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నారని వార్తలు వస్తున్నాయి.

ఆమె పాత్ర చాలా ప్రత్యేకంగా ఉండబోతుందని, కథ విన్న వెంటనే సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. ఇంతకు ముందూ సమంత – రామ్ చరణ్ జంటగా ‘రంగస్థలం’ (Rangasthalam) చిత్రంలో అద్భుతమైన కాంబినేషన్‌ను చూపారు. ఇప్పుడు మరోసారి వీరిద్దరి జోడీ స్క్రీన్ మీద కనపడబోతుందా? అన్నదానిపై ఆసక్తి నెలకొంది. ఈ సినిమాని వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ (Sukumar) రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ (A.R.Rahman) ఈ చిత్రానికి సంగీతాన్ని అందించనున్నారు. మరి సమంత రోల్ గురించి అధికారిక ప్రకటన ఎప్పుడొస్తుందో వేచి చూడాలి.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.