March 19, 202511:24:23 AM

Shankar: అపరిచితుడు 2 క్యాన్సిల్.. మరి నెక్స్ట్ హీరో ఎవరు?

స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) మరియు ‘ఇండియన్ 3’ (Indian 3) ప్రాజెక్టులపై పూర్తి ఫోకస్ పెట్టారు. ‘ఇండియన్ 3’ షూటింగ్ ఇప్పటికే పూర్తయి, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు రామ్ చరణ్‌తో చేస్తున్న ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ కూడా చివరి దశకు చేరుకుంది. ఈ సినిమా షూటింగ్ సుమారు 90% పూర్తయిందని టాక్. జనవరి 10న విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

Shankar

ఇప్పుడు అందరిలో ఆసక్తి కలిగించే ప్రశ్న – శంకర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి? ఆయన ఏ స్టార్ హీరోను డైరెక్ట్ చేయబోతున్నారు? ఇది టాలీవుడ్ మరియు కోలీవుడ్ ప్రేక్షకుల్లో చర్చనీయాంశంగా మారింది. గతంలో ‘2.0’ (2.O) చిత్రం తర్వాత ‘ఇండియన్ 3’ రూపొందించడానికి ఆరేళ్ల సమయం తీసుకున్న శంకర్, ఆ ప్రాజెక్ట్ లో సమస్యలు రావడంతో రామ్ చరణ్ తో ‘గేమ్ ఛేంజర్’ లైన్ లో పెట్టి పట్టాలెక్కించారు.

ఇప్పుడు ‘గేమ్ ఛేంజర్’ విజయవంతం అవ్వడం శంకర్ కెరీర్ కి ఎంతో కీలకం. ఎందుకంటే, ఇటీవల శంకర్ డైరెక్షన్ లో వచ్చిన సినిమాలు కమర్షియల్ గా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయాయి. ‘ఇండియన్ 3’ మంచి విజయాన్ని అందుకుంటుందని ఆయన ఆశిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఆయన తన స్టామినాను మరోసారి చూపించాలనుకుంటున్నారు.

అయితే కొత్త ప్రాజెక్ట్ గురించి శంకర్ ఇప్పటి వరకు ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు. ‘గేమ్ ఛేంజర్’ విడుదల అనంతరం మాత్రమే ఆయన తదుపరి ప్రాజెక్ట్‌పై స్పష్టత వచ్చే అవకాశముంది. ఆమధ్య అపరిచితుడు సీక్వెల్ గా రన్ వీర్ తో (Ranveer Singh) న్యూ ప్రాజెక్టు ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వచ్చింది. కానీ ఆ ప్రాజెక్టు నుంచి హీరో తప్పుకున్నట్లు మరొక టాక్ వచ్చింది. ఇక ప్రస్తుతం సినీ పరిశ్రమలో శంకర్ నెక్స్ట్ హీరోగా ఎవరనేది సస్పెన్స్ గా మారింది. మరి ఈ విషయంలో ఆయన ఎలాంటి క్లారిటీ ఇస్తారో చూడాలి.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.