March 22, 202503:30:26 AM

Sree Vishnu: ‘స్వాగ్’ కి పెద్ద పరీక్షే.. కానీ హీరో మాత్రం..!

శ్రీవిష్ణు (Sree Vishnu).. కెరీర్ ప్రారంభం నుండి వైవిధ్యమైన సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఇతని సినిమా అంటే ప్రేక్షకుల్లో ఓ నమ్మకం ఏర్పడింది. కచ్చితంగా శ్రీవిష్ణు సినిమాలో మంచి కంటెంట్ ఉంటుంది అని..! ఎంటర్టైన్మెంట్ తో కూడుకున్న సినిమాలు చేసినప్పుడు.. శ్రీవిష్ణుకి విజయం ఎప్పుడూ మొహం చాటేసింది లేదు. అందుకే వరుస ప్లాప్స్ లో ఉన్నప్పుడు ‘సామజవరగమన’ (Samajavaragamana) తో కం బ్యాక్ ఇవ్వగలిగాడు శ్రీవిష్ణు. ఇక ఆ తర్వాత వచ్చిన ‘ఓం భీం బుష్’ (Om Bheem Bush) కూడా బాగానే ఆడింది.

Sree Vishnu

ఇక ఈ వారమే ‘స్వాగ్’  (Swag) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు శ్రీవిష్ణు. హసిత్ గోలి  (Hasith Goli)  ఈ చిత్రానికి దర్శకుడు. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన ‘రాజ రాజ చోర’ (Raja Raja Chora) సినిమా బాక్సాఫీస్ వద్ద డీసెంట్ సక్సెస్ అందుకుంది. టీజర్, ట్రైలర్స్..లో కథ ఏంటి అనేది పెద్దగా రివీల్ చేయకపోవడం వల్ల.. దీని ఫలితం ఎలా ఉంటుందా అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

అక్టోబర్ 4న ఈ సినిమా విడుదల కాబోతోంది. దీంతో పాటు చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కానీ.. అవి ‘స్వాగ్’ కి పోటీ ఏమీ కాదు. అయితే గత వారం రిలీజ్ అయిన ‘దేవర’ (Devara) బాక్సాఫీస్ వద్ద సక్సెస్ఫుల్ గా దూసుకుపోతుంది. మరోపక్క ‘సత్యం సుందరం’ (Sathyam Sundaram) కి పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ సినిమాకి రోజురోజుకు ఆక్యుపెన్సీలు పెరుగుతున్నాయి. కాబట్టి ఈ క్రమంలో రిలీజ్ అవుతున్న ‘స్వాగ్’ పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా.. ఎంత వరకు నిలదొక్కుకుంటుంది? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.

ఇదే ప్రశ్న శ్రీవిష్ణుని అడిగితే.. ‘కంటెంట్ పై నాకు బలమైన నమ్మకం ఉంది. దసరా సెలవులు ఉన్నాయి. ‘దేవర’ ‘సత్యం సుందరం’ సినిమాలు ఉన్నప్పటికీ.. అవి చూసేసిన ప్రేక్షకులకి ఇంకో ఆప్షన్ గా మా సినిమా ఉంటుంది. వాళ్ళు చూసినా సరిపోతుంది’ అంటూ చెప్పుకొచ్చాడు.సో శ్రీవిష్ణు హ్యాట్రిక్ కొడతాను అనే కాన్ఫిడెన్స్ లో ఉన్నాడు. చూడాలి మరి అతని నమ్మకం ఎంత బలమైందో..!

దాదా సాహెబ్‌ వచ్చింది.. ప్రభాస్‌ సినిమా అప్‌డేటూ వచ్చింది!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.