March 26, 202508:04:15 AM

Vettaiyan: వేట్టయన్ మూవీ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. ఆ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందా?

సూపర్ స్టార్ రజనీకాంత్  (Rajinikanth)  నటించిన వేట్టయన్ (Vettaiyan) మూవీ నేడు థియేటర్లలో విడుదలైంది. తెలుగులో ఈ సినిమాను వేటగాడు అనే టైటిల్ తో రిజిష్టర్ చేయాలని మేకర్స్ భావించినా ఆ టైటిల్ కు సంబంధించి కొన్ని సమస్యలు ఉండటంతో ఒరిజినల్ టైటిల్ తోనే మేకర్స్ ఈ సినిమాను రిలీజ్ చేశారు. క్రిటిక్స్ నుంచి ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండటంతో కలెక్షన్ల విషయంలో ఈ మూవీ అదరగొట్టడం పక్కా అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Vettaiyan

వేట్టయన్ మూవీ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థలలో ఒకటైన అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. ఒకింత ఆలస్యంగానే ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఆరు వారాలు లేదా ఎనిమిది వారాల తర్వాత ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. వేట్టయన్ మూవీ బాక్సాఫీస్ కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉంటాయో చూడాలి. వేట్టయన్ రిలీజ్ తో రజనీకాంత్ అభిమానులు ఎంతో సంతోషిస్తున్నారు.

రజనీకాంత్ భవిష్యత్తు సినిమాలు సైతం భారీ హిట్లుగా నిలవాలని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. రజనీకాంత్ రెమ్యునరేషన్ 150 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని ప్రచారం జరుగుతోంది. తమిళనాట ఈ సినిమా కలెక్షన్ల విషయంలో అదరగొడుతోంది. అనిరుధ్  (Anirudh Ravichander) సాంగ్స్, బీజీఎం వేట్టయన్ సినిమాకు ప్లస్ అయ్యాయని సోషల్ మీడియాలో కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

దసరా పండుగ కానుకగా మంచి సినిమా చూడాలని భావించే ప్రేక్షకులకు వేట్టయన్ మంచి ఆప్షన్ గా నిలుస్తుంది. దసరా సెలవులను ఈ సినిమా బాగానే క్యాష్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. జై భీమ్ ఫేమ్ టి.జె.జ్ఞానవేల్ (T. J. Gnanavel)  తెరకెక్కించడం ఈ సినిమాకు ప్లస్ అయింది. రజనీకాంత్ ఫ్యాన్స్ కు మాత్రం ఈ సినిమా ఫుల్ మీల్స్ అని చెప్పవచ్చు. వేట్టయన్ సినిమా రిలీజ్ వల్ల కంగువ సినిమా నవంబర్ కు వాయిదా పడిన సంగతి తెలిసిందే.

‘శ్వాగ్’ 6 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.