March 23, 202506:53:33 AM

Akira Nandan: తన గురువు దగ్గరకు అకిరాను పవన్‌ పంపించాడా? ఎంట్రీ ఎప్పుడు?

జూనియర్‌ పవర్‌ స్టార్‌ అకిరా నందన్‌ (Akira Nandan) సినిమాల్లోకి వస్తాడా? దీనికి రెండు రకాల సమాధానాలు వస్తాయి. ఒకటి.. ఇదేం ప్రశ్న కచ్చితంగా సినిమాల్లోకి వస్తాడు అయితే, ఏమో వాళ్ల మదర్‌ అలా అనడం లేదు కదా అనేది రెండో మాట. ఈ రెండింటిలో ఏది నిజమవుతుందో తెలియదు కానీ.. గత కొన్ని రోజుల నుండి ఓ వార్త తెలుగు సినిమా మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదే అకిరా ఆల్‌ రెడీ నటనలో శిక్షణ మొదలుపెట్టాడు అని.

Akira Nandan

అవును.. ఇప్పటికే న్యూయార్క్‌లో సినిమాలకు సంబంధించి శిక్షణ తీసుకున్న అకిరా నందన్‌ (Akira Nandan) ఇప్పుడు స్టార్‌ హీరోల కార్ఖానాకు వెళ్లాడు అని అంటున్నారు. టాలీవుడ్‌లో ఇప్పుడున్న స్టార్‌ హీరోల్లో చాలా మందికి శిక్షణ ఇచ్చిన వ్యక్తి సత్యానంద్‌. పవన్‌ కల్యాణ్‌కు (Pawan Kalyan)  శిక్షణ ఇచ్చింది కూడా ఆయనే. తన నటనకు ఓనమాలు దిద్దించిన వ్యక్తి దగ్గరకు అకిరాను పవన్‌ కల్యాణ్‌ పంపించాడు అని అంటున్నారు. తనలా సిద్ధమయ్యాక సినిమాల్లోకి తీసుకురావాలనేది పవన్‌ ఆలోచన అని చెబుతున్నారు.

ఈ లెక్కన అకిరా విశాఖపట్నంలో ఉంటూ నటనలో శిక్షణ తీసుకుంటున్నాడని చెబుతున్నారు. అయితే మరికొందరు అలాంటిదేం లేదని.. అకిరా త్వరలో విశాఖపట్నం వస్తాడు అని అంటున్నారు. ఇంకొందరు అయితే గతంలో అకిరా తల్లి రేణు దేశాయ్‌ మాటల్ని గుర్తు చేస్తున్నారు. అకిరా నటనలోకి వచ్చేది లేదు అనేది ఇంకా తేలాల్సి ఉందని అన్నారు. కానీ ఇటు చూస్తే నటనలో శిక్షన అని అంటున్నారు.

దీంతో పవన్‌ కల్యాణ్‌ వారసుడు ఇప్పుడు సినిమాల్లోకి వస్తాడా లేదా అనేది కాకుండా వైజాగ్‌లో ఉన్నాడా లేదా అనేదే ప్రశ్నగా మారింది. అన్నట్లు అకిరాకు సంగీతం అంటే ఆసక్తి ఉంది. గతంలో ఆయన సంగీత సాధన, ప్రదర్శన చేసిన వీడియోలు బయటకు వచ్చాయి. కుటుంబ ఈవెంట్‌లో కూడా అకిరా పియానో ప్లే చేయడం చూశాం. మరి అకిరా సినిమాల్లోకి వస్తాడా? లేదా? అనేది చూడాలి.

అమెరికా అధ్యక్షుడు యాక్టర్‌ కూడా తెలుసా? ఏ సినిమాల్లో నటించాడంటే?

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.