March 24, 202508:01:43 AM

Ali: ప్రముఖ నటుడు అలీకి అధికారుల నోటీసులు.. ఏం జరిగిందంటే?

ప్రముఖ నటుడు అలీకి తెలంగాణ అధికారులు నోటీసులు జారీ చేశారు. వికారాబాద్‌ జిల్లా నవాబ్‌పేట మండలం ఎక్‌మామిడి గ్రామ పంచాయతీ అధికారులు ఈ నోటీసులు ఇచ్చారు. అనుమతి లేకుండా తన ఫామ్‌హౌస్‌లో నిర్మాణాలు చేపడుతున్నారని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శి శోభారాణి అలీకి నోటీసులు జారీ చేసి నిర్మాణాలు ఆపివేయాలని సూచించారు.

Ali

నిజానికి ఈ వ్యవహారంలో అలీకి నోటీసులు అందడం తొలిసారేం కాదు. ఎక్‌మామిడి రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబరు 345లో అలీకి ఓ ఫామ్‌హౌస్‌ ఉంది. అందులో నిర్మాణాలకు సంబంధిత పత్రాలను సమర్పించి అనుమతులు పొందాని గతంలోనే అలీకి నోటీసులు ఇచ్చారు. అయితే ఈ విషయంలో ఆయన స్పందించకపోడంతో తాజాగా పంచాయతీ కార్యదర్శి మళ్లీ నోటీసులు జారీ చేశారు.

నిర్మాణానికి సంబంధించిన ధ్రువ పత్రాలను వెంటనే కార్యాలయంలో సబ్మిట్‌ చేసిన అవసరమైన అనుమతులు పొందాలని అధికారులు అలీకి సూచించారు. లేకపోతే పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. మరి అలీ గతంలో ఎందుకు స్పందించలేదు, ఇప్పుడు స్పందిస్తారో లేదా అనేది చూడాలి.

మహేష్.. SSMB28 స్టార్ట్ చేసే ముందు ఆఖరి ట్రిప్ ఇదే!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.